గొప్పోళ్లయినా వారికి ఒక గతం ఉంటుంది. ఆ గతాన్ని నెమరు వేసుకుంటే ఎమోషన్ రాజుకుంటుంది. .. కెరీర్ వ్యవహారాలు.. కుటుంబ పరమైన ఎన్నో అంశాలు.. బంధుమిత్రులతో వెతలు ఇతరత్రా ఎన్నో ఉంటాయి. అవన్నీ స్ఫురణకు వస్తే ఎవరికైనా ఎమోషన్ అనేది కామన్. ఇప్పుడు అలాంటి ఉద్వేగానికే గురయ్యారు మోహన్ బాబు.
భక్తవత్సలం నాయుడు అనేది మోహన్ బాబు అసలు పేరు అన్న సంగతి తెలిసినదే. మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని మోదుగుల పాలెం నుంచి భక్తవత్సలం నాయుడు అలియాస్ మోహన్ బాబు మద్రాసుకు పయనమయ్యారు.
నాటి రోజులు వేరు. పేదరికం వేరు. మోహన్ బాబు మద్రాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్ (వైయమ్సీఏ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ & ఆర్ట్స్ కాలేజ్)లో నటవిద్యను అభ్యసించి అటుపై దర్శకరత్న దాసరి నారాయణరావు అండదండలతో నటుడిగా కెరీర్ ని సాగించారు. ఆ క్రమంలోనే తల్లిదండ్రులు మంచు నారాయణస్వామి- లక్ష్మమ్మ అండదండలు తన ఎదుగుదలకు సహకరించాయి.
విలన్ గా.. సహాయ నటుడిగా.. హీరోగా.. నిర్మాతగా.. రాజకీయ నాయకుడిగా.. విద్యా సంస్థల అధినేతగా .. బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన అరుదైన ప్రతిభావంతుడిగా మోహన్ బాబుకు అభిమానులు ఉన్నారు. ఆయన తన గతం గురించి ఓ సందర్భంలో ఎంతో ఎమోషనల్ అయ్యారు. ''గతాన్ని నెమరువేసుకుంటే తెలియని దుఃఖం వస్తుంది.. నేను ఎంత రఫ్ గా కనిపిస్తానో అంతకంటే చాలా సున్నితం.. ఏదీ తట్టుకోలేను'' అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇప్పుడు మరోసారి అలాంటి ఎమోషన్ ఆయనలో బయటపడింది. ఇలాంటి కష్టం నా పగోడికైనా రాకూడదని ఆయన ఆవేదన చెందారు. తన సినీ కెరీర్ లో ఎదురైన కష్ట నష్టాలను గుర్తు చేసుకుంటూ కలతకు గురయ్యారు.
సినిమాల కోసం ఇల్లు కూడా అమ్ముకున్నానని .. తనని కష్ట కాలంలో ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని మోహన్ బాబు ఆవేదన చెందారు. తాను నటించిన సన్నాఫ్ ఇండియా- జిన్నా చిత్రాలు ఫెయిలయ్యాయని వెల్లడించారు. సినీపరిశ్రమను నడిపించేది సక్సెస్ ఒక్కటే. అది లేకుంటే ఎదురయ్యే సమస్యలను ఎంబీ ప్రస్థావించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.