Begin typing your search above and press return to search.

'మిశ్రమ రివ్యూలు వచ్చాయి.. కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్'

By:  Tupaki Desk   |   27 Jun 2022 7:52 AM GMT
మిశ్రమ రివ్యూలు వచ్చాయి.. కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్
X
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ''సమ్మతమే''. గీతా ఆర్ట్స్ ద్వారా ఈ నెల 24న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. రివ్యూలు కూడా ఆశాజనకంగా లేవు. అయితే మూడు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది పీపుల్స్ బ్లాక్ బస్టర్ అంటూ సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో కిరణ్ మాట్లాడుతూ.. ''సమ్మతమే సినిమా చూసిన ప్రేక్షకులు మా కథే తీశారని.. మా లైఫ్ లో కూడా ఇలా జరిగిందని అభినందించడం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు ఈ కథని ఎంత బలంగా నమ్మారో అంత బలంగా తీశారు. ఈ రోజు సినిమా అందరికీ నచ్చడం ఆనందంగా వుంది'' అని అన్నారు.

అయితే 'సమ్మతమే' సినిమాకు దాదాపు అన్ని సమీక్షలు ప్రతికూలంగా మారడంతో విసిగిపోయినట్లు కిరణ్ అబ్బవరం స్పీచ్ ని బట్టి అర్థం అవుతోంది. 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' చిత్రానికి కూడా మొదట్లో మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. మంచి డైలాగులు రాయలేదని విమర్శకులు అన్నారు.. కొందరు కిరణ్ కెరీర్ ముగిసిందని కూడా అన్నారు. అయితే ఈవినింగ్ షో ద్వారా యూనానిమస్ బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చింది. 'సమ్మతమే' కి కూడా అదే జరిగింది అని యువ హీరో అన్నారు.

''మార్నింగ్ షో తర్వాత మిశ్రమ రివ్యూలు కొన్ని వినిపించాయి. ఈవినింగ్ సంధ్య థియేటర్ కి వెళ్లి చూస్తే మొత్తం హౌస్ ఫుల్. ప్రేక్షకులంతా విజల్స్ వేస్తూ ఒక మాస్ సినిమాని చూస్తున్నట్లు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి డైలాగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ పాటు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కుటుంబమంతా కలసి ఎంజాయ్ చేశామని చెప్పడం మరింత ఆనందంగా వుంది''

''థియేటర్ కి వచ్చి 'సమ్మతమే' చిత్రం చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రేక్షకుల వల్లనే ఈ సినిమా పీపుల్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది ప్రేక్షకుల విజయం. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ - బన్నీ వాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సినిమాని గొప్పగా విడుదల చేశారు. మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు''

''థియేటర్లు పెరుగుతున్నాయి. యూస్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిపీట్ ఆడియన్స్ వెళ్తున్నారు. రెస్పాన్స్, కలెక్షన్స్ అద్భుతంగా వున్నాయి. యూస్ ఆడియన్స్ కి థాంక్స్. టీం మొత్తానికి స్పెషల్ థాంక్స్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. 'సమ్మతమే' చిత్రాన్ని అందరూ మన సినిమా అనుకొని ఆదరించారు. ఇంకా చూడని వాళ్ళు థియేటర్ కి వెళ్లి చూడండి. థియేటర్ ఎక్సపిరియన్స్ మిస్ కావద్దు'' అని కిరణ్ అబ్బావరం చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే కిరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా రిలీజైన శుక్రవారం నాడు కాకుండా సోమవారం రివ్యూలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. టాక్ ఎలా ఉందనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారని.. అలానే టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్ లో వసూళ్ళు వస్తాయనేది యువ హీరో ఉద్దేశ్యం.

ఇకపోతే 'సమ్మతమే' సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించగా.. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించారు.