Begin typing your search above and press return to search.

నగ్నంగా ప్రముఖ నటి మృతదేహం.. హత్యచేసి గోనె సంచిలో కుక్కి..

By:  Tupaki Desk   |   19 Jan 2022 3:32 PM GMT
నగ్నంగా ప్రముఖ నటి మృతదేహం.. హత్యచేసి గోనె సంచిలో కుక్కి..
X
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం అలుముకుంది. ప్రముఖ బంగ్లాదేవ్ నటి దారుణ హత్యకు గురైంది. ఆమె భర్తే ఈ హత్య చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

ప్రముఖ బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము గత వారం రోజుల నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమె భర్త షఖావత్ అలీ రెండు రోజుల క్రితం పోలీసులకు తన భార్య మిస్ అయినట్లు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రైమా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జనవరి 18న ఢాకాలోని కేరానీ గంజ్ బ్రిడ్జి సమీపంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

ఆమె మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి నగ్నంగా మృతదేహం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. రైమా శరీరంపై కనిపించిన గాయం గుర్తులను బట్టి రెండు రోజుల క్రితం ఆమెను హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రైమా హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త షెకావత్ ను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించగా భార్య హత్య కేసులో తానూ కూడా భాగమైనట్లు ఒప్పుకున్నారు. ఈ హత్యలో తనతోపాటు మరికొందరు కూడా ఉన్నట్లు నిందితుడు తెలుపడంతో వారందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రైమా హత్యకు గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.

‘బర్తమాన్’ చిత్రంతో వెండితెరకు రైమా పరిచయమైంది. దాదాపు 25 సినిమాల్లో నటించింది. ఇక 46 ఏళ్ల వయసులో ప్రస్తుతం ఆమె టీవీ ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తూ కనిపించింది. హీరోయిన్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.