Begin typing your search above and press return to search.

మంత్రి జోక్యంతో.. షూటింగ్ ల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

By:  Tupaki Desk   |   23 Jun 2022 10:49 AM GMT
మంత్రి జోక్యంతో.. షూటింగ్ ల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌
X
క‌నీస వేత‌నాలు ఇవ్వ‌డం లేదంటూ సినీ కార్మికులు బుధ‌వారం మెరుపు స‌మ్మెకు దిగిన విష‌యం తెలిసిందే. దీంతో చాలా వ‌ర‌కు సినిమాల షూటింగ్ లు ఎఫెక్ట్ అయ్యాయి. సినీ కార్మికుల ఆక‌స్మిక బంద్‌ కార‌ణంగా దాదాపు 28 సినిమాల షూటింగ్ ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది.

సినీ కార్మికుల క‌నీస వేత‌నాల విష‌యంలో ఫిల్మ్ ఛాంబ‌ర్ కు ఫేడ‌రేష‌న్ కు మ‌ధ్య ఏర్ప‌డిన వివాదం బుధ‌వారం సాయంత్రం మ‌రింత ముదిరింది. ప్ర‌స్తుత స‌మ‌స్య‌కు మీరు కార‌ణం అంటే మీరు కారణం అంటూ ఛాంబ‌ర్‌, ఫెడ‌రేష‌న్ ప‌ర‌స్ప‌రం ఆరోపించుకున్నాయి.

దీంతో స‌మ‌స్య జ‌ఠ‌లంగా మార‌డంతో కార్మికులు గురువారం తెలంగాణ సినీమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌రావుని క‌లిశారు. ఫిల్మ్ ఛాంబ‌ర్ స‌భ్యుల‌తో పాటు ఫెడ‌రేష‌న్ స‌భ్యులు కూడా ఈ స‌మ‌స్య‌పై త‌ల‌సానిని వేరు వేరుగా క‌లిసి త‌మ స‌మ‌స్య‌ని వివ‌రించారు. అయితే ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న మంత్రి ఇద్ద‌రి వాద‌న‌లు భిన్నంగా వున్నాయ‌ని, స‌మ‌స్య‌ని సానుకూలంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించారు.

కార్మికుల స‌మ్మె రెండ రోజుకు చేర‌డంతో త్వ‌ర‌గా కార్మికుల స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించి షూటింగ్ లు య‌దావిధిగా జ‌ర‌గాల‌ని సూచించారు. అనంత‌రం త‌ల‌సాని జోక్యం చేసుకోవ‌డంతో చ‌ర్చ‌లు ఫ‌లించాయ‌ని తెలిసింది. దీంతో శుక్ర‌వారం నుంచి య‌ధావిధిగా షూటింగ్ లు ప్రారంభం కానున్నాయి.

నిర్మాత సి. క‌ల్యాణ్ మాట్లాడుతూ' మంత్రి త‌ల‌సాని జోక్యంతో ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నాం. రేప‌టి నుంచి య‌ధావిధిగా షూటింగ్ లు జ‌రుగుతాయి. రేపు కో ఆర్డినేష‌న్ క‌మిటి నిర్ణ‌యించిన త‌రువాత కార్మికుల వేత‌నాలపై ఓ స్ప‌ష్ట‌త వ‌స్తుంది.

ఫిల్హ్ ఛాంబ‌ర్‌, ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ద్వారా కార్మికుల‌కు వేత‌నాలు చెల్లిస్తాం. రేపు దిల్ రాజు అధ్య‌క్ష‌త‌న ఛాంబ‌ర్‌, ఫెడ‌రేష‌న్ స‌మావేశం అవుతుంద‌ని తెలిపారు. ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ 'వేత‌నాల స‌మ‌స్య‌పై ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యామ‌ని, క‌నీస వేత‌నాలు చెల్లించ‌డానికి నిర్మాత‌లు అంగీక‌రించార‌ని, రేపు క‌మిటీలు వేత‌నాల‌ని నిర్ణ‌యిస్తాయ‌ని, అదే విధంగా రేప‌టి నుంచి షూటింగ్ లు కొన‌సాగుతాయ‌ని తెలిపారు.