అల.. కాళ్లు ఎత్తేయడం వెనక అంత కథ ఉందా?

Thu Jul 16 2020 09:30:32 GMT+0530 (IST)

Millionaire Pooja Hegde Lifts Her Legs

ఏమీ చేయలేని పరిస్థితిలో చేతులెత్తేస్తారు. కానీ ఈవిడేమిటి కాళ్లు ఎత్తేసింది. అది కూడా `వీ` షేప్ లో ఆ యోగా ఫోజులేమిటి?  దానివెనక కారణం ఏమిటో కాస్త చెబుతారా? .. వెతికితే కచ్ఛితంగా అంత గుడ్ రీజన్ దొరుకుతుందిలేండి.బుట్టబొమ్మ పూజా హెగ్డే ఓ అరుదైన రికార్డ్ సాధించింది. అదేమిటి? అంటే... ఇప్పటికి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో 11 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించింది. 11 మిలియన్లు అంటే ఏకంగా కోటి 10లక్షల మంది అన్నమాట. ఇది నిజంగానే రేర్ ఫీట్. ఈ ఆనందంలోనే పూజా అలా తన కాళ్ళను యోగా భంగిమలో పైకి ఎత్తి వాటిని 11 అంకెగా చూపించింది.

అయినా కాళ్లు ఎత్తాల్సిన అవసరం ఏమిటి?   చేతులెత్తేస్తే పోలా అంటారా?.. అంటే అందుకు ప్రత్యేక కారణం లేకపోలేదు. అసలు పూజాకి అంత గొప్ప ఫాలోయింగ్ పెరగడం వెనక బన్ని ఫ్యాన్స్ కూడా ఓ కారణం. అల్లు అర్జున్ సరసన నటించిన అల వైకుంఠపురములో బంపర్ హిట్ అవ్వడమే కాదు.. అల పాత్రలో పూజాని బాగా వోన్ చేసుకున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా అల బుట్టలో బంటు (బన్ని) ఎందుకు పడతాడు? అంటే ఆ పొడుగు కాళ్లు చూసే కదా? ఆ కాళ్ల సొగసును చూసేందుకు తెగ తహతహలాడిపోయే కుర్రాడిగా కనిపించాడు.  పొట్టి ఫ్రాకులో పరికిణీల్లో అమ్మాయి కాళ్ల అందం చూసేందుకు బోయ్స్ ఎంతగా తపించిపోతారో త్రివిక్రమ్ ఎంతో నిజాయితీగా చూపించారు. అది బాగా వర్కవుటైంది కూడా. అందుకే తన కాలి సొగసును చూడమని పూజా మరోసారి 11 అంకెతో హింట్ ఇచ్చిందన్నమాట. # మిలియనీర్ # బుట్టబొమ్మ # సామజవరాగామన గురించి పూజా తాజా ఇన్ స్టా పోస్ట్ లో ప్రస్తావించింది. అయినా మ్యాడమ్ మరీ అలా కాళ్లు ఎత్తేస్తే ఎలా?