ఐటమ్ నంబర్ కోసం కళ్లు భైర్లు కమ్మే పారితోషికం!

Mon Jul 26 2021 14:49:46 GMT+0530 (IST)

Milky White Beauty Tamanna is still full busy

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా నాలుగు చేతులా సంపాదనతో ఇప్పటికీ ఫుల్ బిజీగా ఉన్నారు. బాహుబలి- సైరా లాంటి పాన్ ఇండియా సినిమాల్లో నటించిన తమన్నాకు జాతీయ స్థాయిలో ఫాలోయింగ్ పెరిగిన సంగతి తెలిసినదే. కెరీర్ ప్రారంభించి దశాబ్ధం దాటినా అమ్మడు ఇంకా సౌత్ లో అగ్ర నాయికగా రాణిస్తూనే ఉంది. అటు సోలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూనే ఇటు ఐటం పాటల్లోనూ నటిస్తూ రెట్టింపు సంపాదిస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ గా `ఎఫ్-3`..`సిటీ మార్`..`మ్యాస్ట్రో`..` గుర్తుందా శీతాకాలం` చిత్రాల్లో నటిస్తోంది. అటు బాలీవుడ్ లోనూ మరో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఇంత బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ ఐటం పాటలను సైతం వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే చాలా చిత్రాల్లో కామియో అప్పీరియన్స్ లతో ఆకట్టుకున్న తమన్నా హాట్ ఐటం నంబర్లతోనూ అదే రేంజ్ లో ఎలివేట్ అయ్యే ప్రయత్నాలు చేసింది`జై లవకుశ`.. `సరిలేరు నీకెవ్వరు` .. `జాగ్వార్` సహా పలు చిత్రాల్లో ఐటంగా గాళ్ల్ గా మెప్పించిన సంగతి తెలిసిందే. సాధారణ సన్నివేశాల్లోనే ఎక్స్ ఫోజింగ్ కి పెద్ద పీట వేసే తమన్నా ఐటం పాటల్లో అంతకంతకు కుర్రకారుని అందచందాలతో ఊపేసింది. తాజాగా మరోసారి హాట్ ఐటెమ్ నంబర్ లో నర్తించేందుకు సంతకం చేసింది. అందుకు గాను మిల్కీ భారీగా పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా `గని` సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఐటం హీరోయిన్ గా తమన్నాని ఫైనల్ చేసారు. ఒక్క పాట కోసమే 75 లక్షలు పారితోషికం ఇస్తున్నారు.

వాస్తవానికి తమన్నా కోటి డిమాండ్ చేసిందిట. కానీ నిర్మాతలకు చివరిగా 75 లక్షలకు లాక్ చేసారు. అంతకు మించిన బేరం లేకుండా ఇదే బంపర్ ఆఫర్ అని భావించిన తమన్నా వెంటనే సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ పాట ఐదు రోజుల పాటు షూట్ చేయనున్నారుట. అంటే కేవలం ఐదు రోజులకే 75 లక్షలు అందుకుంటోందన్న మాట. తమన్నాని ఏరికోరి మరి ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని అల్లు బాబి తన స్నేహితుడు సిద్దు ముద్దాతో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో ఉపేంద్ర- సునీల్ శెట్టి- శెయి మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఐటెమ్ నంబర్లకు ది బెస్ట్..!

ఐటమ్ నంబర్ల స్పెషలిస్టులుగా ఇంతకుముందు నోరా ఫతేహి- మలైకా అరోరాఖాన్ -ఎల్లీ అవ్ రామ్ లాంటి భామలు ఒక రేంజులోనే ఏలారు. ముమైత్ ఖాన్ దశాబ్ధం పాటు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది. ఆ తర్వాత చాలా కాలంగా కథానాయికలే ఐటమ్ నంబర్లకు ఓకే చెబుతూ హుషారు పెంచారు. కేవలం ఐటం పాట కోసం ఐదారు రోజుల చిత్రీకరణ కోసం ఏకంగా కోటి పారితోషికం అందుకుంటున్న భామలు ఉన్నారు. బాలీవుడ్ లో ఐటమ్ నంబర్లతో హీట్ పెంచుతూ కోటి నుంచి 3 కోట్లు అందుకుంటున్న భామలకు కొదవేమీ లేదు.