Begin typing your search above and press return to search.

అమీర్ ఖాన్ తో రొమాన్స్ కి ఆస్కార్ ఉత్త‌మ న‌టి సై

By:  Tupaki Desk   |   20 March 2023 12:00 PM GMT
అమీర్ ఖాన్ తో రొమాన్స్ కి ఆస్కార్ ఉత్త‌మ న‌టి సై
X
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పాన్ ఇండియాలో కోట్లాది మంది అభిమానించే బిగ్ స్టార్. వెండి తెర‌పై ఆయ‌న చేయ‌ని ప్ర‌యోగం అంటూ ఉండ‌దు. మిగ‌తా స్టార్ హీరోలంద రికంటే భిన్నంగా సినిమాలు చేయ‌డం అమీర్ ప్ర‌త్యేక‌త‌. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌తో పాటు ప్ర‌యోగాత్మ‌క మైన పాత్ర‌ల వైపు ప‌రుగులు తీయ‌డం అంటే? ఆయ‌నకు ఎంతో ఇష్టం. కొన్నిసార్లు ఆ ప్ర‌యోగాలు బెడిసి కొట్టినా! వెన‌క్కి త‌గ్గే ర‌కం కాదు.

న‌ష్టాల్ని సైతం భ‌రించి ముందుకు దూసుకెళ్లే మిసైల్ లాంటి వాడు. తాజాగా 95వ ఆస్కార్ అవార్డుల ఉత్త‌మ న‌టి మిషెల్ యో అమీర్ తోనూ రొమాన్స్ చేయ‌డానికి సై అనేసింది. 'ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వ‌న్స్' లో అత్యుత్త‌మ న‌ట‌న‌కు గానూ ఆమె ఆస్కార్ ఉత్త‌మ న‌టిగా ఎంపికైంది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా మిషెల్ ఫేమ‌స్ అయ్యారు. ఈ సంద‌ర్భంలో ఓ ఇంట‌ర్వ్యూలో అమీర్ తో క‌లిసి ప‌నిచేయాల‌న్న ఆస‌క్తిని వ్య‌క్తం చేసింది.

'అమీర్ ఖాన్ తో గ‌తంలో క‌లిసి ప‌ని చేయ‌లేదు. కానీ మేము ఇద్ద‌రం 'లివ్ టూ ల‌వ్' అనే ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా చేసాం. ఆ ర‌కంగా అమీర్ తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

ఆయ‌న గొప్ప న‌టుడే కాదు. మంచి మాన‌వ‌తా వాది. చాలా స‌ర‌ద‌గా ఉంటాడు. చుట్టూ ఉన్న వారు కూడా ఆయ‌న‌లాగే ఉండాల‌ని కోరుకుంటారు. వీలైనంత వ‌ర‌కూ త‌న వాతావ‌ర‌ణం అంతా అలా ఉండాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు.

ఈమధ్య‌నే ఆయ‌న న‌టించిన '3 ఇడియ‌ట్స్' సినిమా చూసాను. దాంతో ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నాను' అని తెలిపింది. మ‌రి ఆస్కార్ బ్యూటీకి అమీర్ ఛాన్స్ ఇస్తారా? అన్న‌ది చూడాలి.

అమీర్ ఖాన్ చివ‌రిగా 'లాల్ సింగ్ చ‌డ్డా' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవ‌డంలో తీవ్రంగా విఫ‌ల‌మైంది. దీంతో లాంగ్ బ్రేక్ తీసుకుని హిట్ కంటెంట్ తోనే బాద్ షా ప‌ఠాన్ లా దూసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.