మీటర్ ట్రైలర్ టాక్: బాక్సాఫీస్ మీటర్ పగిలేలా కిరణ్ అబ్బవరం యాక్షన్

Wed Mar 29 2023 13:47:26 GMT+0530 (India Standard Time)

Meter Telugu Movie Trailer  Kiran Abbavaram

వరుస సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా మూవీ మీటర్ ట్రైలర్ రిలీజ్ అయింది. కిరణ్ అబ్బవరం హీరోగా రమేష్ కడూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కొత్త దర్శకుడు అయినా రమేష్ చెప్పిన కథ నచ్చడంతో కిరణ్ అబ్బవరం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇప్పటికే మేకర్స్ ఈ సినిమా నుంచి రెండు పాటలు ఒక టీజర్ విడుదల చేయగా ఆ కంటెంట్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీటర్ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ యాక్షన్ గా ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది. అనుకోకుండా పోలీస్ అయి ఆ తర్వాత ఎవరిని పట్టించుకోకుండా తాను రాసుకున్న రూల్స్ ప్రకారమే జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉండే ఒక పోలీస్ గా కిరణ్ అబ్బవరం కనిపిస్తున్నారు.

ట్రైలర్ లో కిరణ్ అబ్బవరం ఎంట్రీ అయితే యాక్షన్ ప్యాక్డ్ ఎంట్రీగా కనిపిస్తోంది. అలాంటి హీరో ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ గ్రామంలోనే ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడితో గొడవ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అప్పటి వరకు అల్లరి చిల్లరగా తిరిగిన ఆయన డ్యూటీ మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి సీరియస్ గా తీసుకుంటాడు.

సినిమా ట్రైలర్ చూసిన తర్వాత దర్శకుడు రమేష్ కడూరి కమర్షియల్ గా లాభదాయకమైన సబ్జెక్ట్ని ఎంచుకున్నారని అనిపిస్తోంది. కిరణ్ అబ్బవరం పోలీసు పాత్రలో చాలా ఇస్తూ కనిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన సరసన తమిళ భామ అతుల్య రవి చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. విజువల్స్ గ్రాండ్గా అనిపించాయి.. సాయి కార్తీక్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో విజువల్స్ ని మరో లెవల్ కి తీసుకెళ్లాడు.

మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ) హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందిన ఈ సినిమాను సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.