సమంత పంపిన సందేశం.. చైతూ కోసమేనా..?

Mon Sep 20 2021 16:01:59 GMT+0530 (IST)

Message sent by Samantha for Chaitu

టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య - సమంత గురించి గత నెల రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య విభేధాలు తలెత్తాయని.. ఇది విడాకుల వరకు దారితీసిందని రూమర్స్ వస్తున్నాయి. వీటిపై అటు చైతన్య కానీ ఇటు సామ్ కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇటీవల 'లవ్ స్టోరీ' ట్రైలర్ సందర్భంగా ఒకరికొకరు ట్వీట్ చేసుకున్నప్పటికీ.. పుకార్లకు బ్రేక్ పడలేదు. ఈ నేపథ్యంలో సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.తన వ్యక్తిగత జీవితం మీద అనేక రూమర్స్ వస్తున్నా సమంత మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోకుండా తన ఫెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలను పోస్టులను అభిమానులకు షేర్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో లేటెస్టుగా సామ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన మెసేజ్ కార్డులు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ''అఫ్ కోర్స్ నేను నిన్ను బాధపెట్టి ఉండొచ్చు.. నువ్వు నన్ను బాధ పెట్టి ఉండొచ్చు.. ఇద్దరం ఒకరినొకరం బాధ పెట్టుకుని వుండొచ్చు. కానీ ఇదే ఉనికి. వసంతకాలం కావాలంటే శీతాకాల ప్రమాదాన్ని అంగీకరించడం. ఉనికిగా మారడం అంటే లేని ప్రమాదాన్ని అంగీకరించడం'' అంటూ సామ్ పలు కోట్ లు పోస్ట్ చేసింది.

ప్రస్తుతం నాగ చైతన్య - సమంతల మధ్య ఏదో జరుగుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. సామ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మెసేజ్ కార్డుల ద్వారా సమంత తన భర్త చైతన్య కు సందేశం పంపుతోందని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే అడోరబుల్ కపుల్ చై-సామ్ విడిపోతున్నారనే వార్తలు అభిమానులకు రుచించడం లేదు. విడిపోవడం లేదనే మాటలను వారి నోటి వెంట వినాలని కోరుకుంటున్నారు. వచ్చే నెలలో వీరి పెళ్లి రోజు నాటికైనా దీనిపై క్లారిటీ ఇస్తారని ఆకాంక్షిస్తున్నారు.