మాస్ కా దాస్ వదిలిన 'మెరిసే మెరిసే' ట్రైలర్..!

Thu Jul 29 2021 14:49:26 GMT+0530 (IST)

Merise Merise trailer Released by Mass Ka Das

'హుషారు' 'ప్లే బ్యాక్' ఫేమ్ దినేష్ తేజ్ - శ్వేతా అవస్తి జంటగా నటించిన తాజా చిత్రం ''మెరిసే మెరిసే''. కె. పవన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కొత్తూరి ఎంటర్టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ సినిమా పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'మెరిసే మెరిసే' సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను 'మాస్ కా దాస్' హీరో విశ్వక్ సేన్ విడుదల చేసి మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు.తండ్రులు అందరూ సంపాదించడానికి పుడితే.. దాన్ని ఎంజాయ్ చేయడానికి తనలాంటి వాళ్ళు పుడతారు అంటూ హీరో తన క్యారక్టరైజేషన్ ఏంటో చెప్పడంతో ఈ ట్రైలర్ ప్రారంభం అయింది. ఎనిమిది నెలల్లో పెళ్లి పెట్టుకొని ఈ గ్యాప్ లో ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకునే అమ్మాయిగా హీరోయిన్ ని చూపించారు. విభిన్న మనస్తత్వాలు కలిగిన వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది.. ఈ క్రమంలో ఏర్పడిన మనస్పర్థలు ఎమోషన్స్ లను ఈ ట్రైలర్ చూపిస్తోంది. ఇందులో సంజయ్ స్వరూప్ - గురు రాజ్ - బిందు - సంధ్య జనక్ - మని - శశాంక్ - నానాజీ ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ కొడకండ్ల సంగీతం సమకూర్చారు. 'పెళ్లిచూపులు' నాగేష్ సినిమాటోగ్రఫీ అందించగా.. మహేశ్ ఎడిటింగ్ చేశారు.

ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ''దినేష్ నేనూ 'హుషారు' సినిమా టైమ్ నుంచి ఫ్రెండ్స్. కలిసి క్రికెట్ బాగా ఆడేవాళ్లం. తను మంచి పెర్ఫార్మర్. టాలెటెండ్ ఆర్టిస్ట్. 'మెరిసే మెరిసే' ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. చివరలో దినేష్ చెప్పిన డైలాగ్ సూపర్. థియేటర్లు ఓపెన్ అవడం సంతోషకరం. ఎన్ని ప్లాట్ ఫామ్స్ ఉన్నా థియేటర్ లో సినిమా చూసిన అనుభూతి వేరు. ఆగస్టు 6న థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని తప్పక చూడండి'' అని అన్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు విశ్వక్ సేన్ కు కృతజ్ఞతలు తెలిపారు. 'మెరిసే మెరిసే' ట్రైలర్ ను విశ్వక్ సేన్ విడుదల చేయడం సంతోషంగా ఉందని.. ఆయన సక్సెస్ ఫుల్ హ్యాండ్ తమ సినిమాకూ కలిసొస్తుందని ఆశిస్తున్నామని.. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నామని అన్నారు.