Begin typing your search above and press return to search.
కీర్తి సురేష్ ప్రేమ, పెళ్లి వార్తలపై ఆమె తల్లి ఏమంటోంది?
By: Tupaki Desk | 31 Jan 2023 11:08 AMకీర్తి సురేష్.. విలక్షణమైన పాత్రలకు, సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన క్రేజీ హీరోయిన్. ఒక దశలో తనకు నటన రాదనే విమర్శలు వినిపించినా వాటిని చిరునవ్వుతో స్వీకరించి 'మహానటి' మూవీతో తనలో ఏ స్థాయి గొప్పనటి దాగి వుందో ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డుతో పాటు విమర్శకుల ప్రశంసల్ని సైతం సొంతం చేసుకుని ఇండియన్ సినీ దిగ్గజాల దృష్టిని ఆకర్షించింది.
బాలీవుడ్ ఆఫర్ ని సైతం వదులుకుని దక్షిణాది చిత్రాలకే పరిమితమైన కీర్తి సురేష్‌పై గత కొన్ని రోజులుగా ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నటిగా దక్షిణాది సినిమాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్ 'మహానటి' తరువాత కమర్షియల్ సినిమాలతో పాటు నటనకు ఆస్కారం వున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. మలయాళ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్ మహానటితో జాతీయ స్థాయిలో గుర్తింపుని దక్కించుకుంది.
రెండు దశాబ్దాల తన నట ప్రస్థానంలో ఎన్నో మలుపులు.. ఎన్నో మైలు రాళ్లున్నాయి. ఇదిలా వుంటే కీర్తి సురేష్ గత కొంత కాలంగా ప్రేమలో వుందని, తన చిన్ననాటి క్లాస్ మేట్ ని ప్రేమిస్తోందని, తను కేరళలో ఓ రిసార్ట్ ని రన్ చేస్తున్నాడని, గత 13 ఏళ్లుగా వీరి ప్రేమాయణం నడుస్తోందని, త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై కీర్తి సురేష్ తల్లి, అలనాటి నటి మేనక స్పందించింది.
తన కూతురు కీర్తి సురేష్ పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, తన తరుపున తాను ఆ వార్తల్ని ఖండిస్తున్నానని పేర్కొంది. అయితే కీర్తి సురేష్ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో నటిస్తున్న మాసీవ్ యాక్షన్ డ్రామా 'దసరా'. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీని మార్చి 30న సమ్మర్ కానుకగా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
సోమవారం విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ మూవీతో పాటు కీర్తి సురేష్ తమిళంలో 'సైరన్', రివాల్వర్ రీటా వంటి సినిమాల్లో నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.