Begin typing your search above and press return to search.

మెన్ టూ టాక్ ఎలా ఉందంటే..!

By:  Tupaki Desk   |   27 May 2023 11:34 AM GMT
మెన్ టూ టాక్ ఎలా ఉందంటే..!
X
సెలబ్రిటీస్ మీద జరిగిన లైంగిక దాడి గురించి జరిగిన మీటూ మూమెంట్ అందరికీ తెలిసిందే. అయితే మీటూ మహిళలకు సంబంధించిన వేధింపుల గురించి కాగా అదే కాన్సెప్ట్ ని రివర్స్ లో చెబుతూ మెన్ టూ అంటూ ఒక సినిమా తీశారు డైరెక్టర్ శ్రీకాంత్ జి రెడ్డి. నలుగురు కుర్రాళ్లు వారి జీవితంలో జరిగిన సంఘటనల వల్ల వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్న కథతో ఈ మెన్ టూ వచ్చింది. కథగా రాసుకున్న ప్రతి సినిమా తెర మీద అదే రేంజ్ లో ఉంటుందని చెప్పడం కష్టం. అది నటీనటుల పర్ఫార్మెన్స్, డైరెక్టర్ టేకింగ్ మీద ఆధారపడి ఉంటుంది.

మెన్ టూ విషయంలో నటీనటులు తమ శక్తి మేరకు బాగానే చేసినా డైరెక్టర్ మాత్రం సినిమాను ప్రేక్షకులకు చేరవేయడంలో విఫలమయ్యాడు. మహిళలు తమకు కల్పించిన హక్కులను ఎలా మిస్ యూజ్ చేస్తున్నారు అన్న కాన్సెప్ట్ తో మెన్ టూ తెరకెక్కించారు. అయితే కథనంలో దర్శకుడు చాలా వరకు ట్రాక్ తప్పాడు. తీసుకున్న కాన్సెప్ట్ బాగానే ఉన్నా దాన్ని నడిపించిన తీరు మాత్రం ఆకట్టుకోలేదు. అంతేకాదు సినిమా ల్యాగ్ అయినట్టుగా అనిపించడం పెద్ద మైనస్.

మెన్ టూ లో నటించిన నరేష్ అగస్త్య, మౌర్య, కౌశిక్ లతో పాటుగా బ్రహ్మాజీ, సుదర్శన్ లు తమ నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో మెన్ టూ విఫలమైంది. టీజర్, ట్రైలర్ లతో సినిమాపై కొంత మేరకు అంచనాలు ఏర్పడేలా చేయగా.. యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ చేసి సినిమా సక్సెస్ సాధించాలని అనుకున్న మేకర్స్ ఆలోచన విఫలమైంది. సినిమా ఎక్కడ కూడా ఆసక్తికరంగా అనిపించలేదు.

సినిమా చూసిన ఆడియన్స్ అంతా కూడా బాబోయ్ ఇదేం సినిమా అనేస్తున్నారు. శుక్రవారం రిలీజైన మళ్లీ పెళ్లి, మేం ఫేమస్ సినిమాలతో పాటుగా వచ్చిన మెన్ టూ సినిమా ఆ రెండు సినిమాల కన్నా లీస్ట్ టాక్ తెచ్చుకుంది. ఈమధ్య కాలంలో సినిమాలకు మౌత్ టాక్ అనేది చాలా పవర్ ఫుల్ వెపన్ లా పనిచేస్తుంది. సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా సినిమా చూసిన కొద్దిమంది అయినా బాగుంది అంటే మౌత్ టాక్ స్ప్రెడ్ చేసి సినిమాను హిట్ చేస్తున్నారు. మెన్ టూ లాంటి సినిమాలకు ఈ మౌత్ టాక్ చాలా ఇంపార్టెంట్ కానీ సినిమా చూసిన ఆడియన్స్ కూడా శాటిస్ఫై అవలేదని తెలుస్తుంది.