Begin typing your search above and press return to search.
మేమ్ ఫేమస్.. 3 రోజుల్లోనే అన్ని కోట్లు
By: Tupaki Desk | 29 May 2023 12:26 PMతెలుగులో కొంత కాలంగా యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్లు పెద్దగా రావడం లేదు. దీంతో ఇలాంటి చిత్రాల కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే తాజాగా ఆడియెన్స్ ముందుకు వచ్చిన క్రేజీ మూవీనే 'మేమ్ ఫేమస్'. సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 26వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల అయింది.
తెలంగాణలోని పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిన 'మేమ్ ఫేమస్' మూవీ విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే దీనికి ప్రీమియర్ షోల నుంచే మంచి టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజే ఈ సినిమా రూ. 1.10 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి సత్తా చాటుకుంది. ఆ తర్వాత కూడా ఇదే ఊపును కొనసాగించిందనే చెప్పుకోవాలి.
మొదటి రోజే మంచి వసూళ్లను రాబట్టిన సుమంత్ ప్రభాస్ 'మేమ్ ఫేమస్' మూవీ.. రెండు, మూడు రోజుల్లోనూ ఎవరూ ఊహించని విధంగా హోల్డ్ చేసింది. ఫలితంగా శని, ఆదివారాల్లోనూ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా ఈ సినిమా మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 3.10 కోట్లు గ్రాస్‌ను రాబట్టి సత్తా చాటుకుంది. దీనిపై చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉందనే చెప్పాలి.
క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'మేమ్ ఫేమస్' మూవీకి వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు దక్కాయి. ఇదే విధంగా వీక్ డేస్‌లో కూడా ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ఛాన్స్ ఉందని చిత్ర యూనిట్ ఆశాభావంతో ఉంది.
ఇదే కంటిన్యూ అయితే ఈ చిత్రం మరో రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా చేరుకుని క్లీన్ హిట్‌గా నిలుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'మేమ్ ఫేమస్' మూవీలో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, అంజి తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాను చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్‌లు నిర్మించారు. దీనికి కల్యాణ్ మాణిక్ సంగీతం ఇచ్చారు.