Begin typing your search above and press return to search.

కొత్త పంచాయితీ పెట్టిన మేమ్ ఫేమస్ నిర్మాతలు

By:  Tupaki Desk   |   30 May 2023 9:34 AM GMT
కొత్త పంచాయితీ పెట్టిన మేమ్ ఫేమస్ నిర్మాతలు
X
సినిమా సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అనేది ఆడియన్స్ నచ్చేదాని బట్టి ఉంటుంది. సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం అనేది చాలా కామన్ గా జరుగుతుంది. ఓ విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా అనేది అభిప్రాయాలని, ఆలోచనలని బయటపెట్టె ఒక మాధ్యమం. ఎవరి ఒపీనియన్ వారు ఇందులో షేర్ చేస్తూ ఉంటారు. ఇక స్టార్ హీరోలు, వారి చిత్రాలపై కూడా నెగిటివ్ ప్రచారం చేసే వారు ఉంటారు. పాజిటివ్ అభిప్రాయాలు చెప్పే వారు ఉంటారు.

అయితే స్టార్ హీరోలు, దర్శకులు ఎవరూ తమపైన, తమ సినిమాలపైన జరిగే నెగిటివ్ ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోరు. విమర్శించే వారు ఎప్పుడు అదే చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ ని, నెగిటివ్ ప్రచారాన్ని నెత్తిన వేసుకుంటే ఆ నెగిటివ్ ట్రాప్ లో మనం పడతామని వారికి తెలుసు. అయితే ఈ విషయాన్ని ఎందుకో మేమ్ ఫేమస్ నిర్మాతలు ఇంకా తెలుసుకోలేదా అనే మాట వినిపిస్తోంది.

నిజానికి చాయ్ బిస్కెట్, లహరి ఫిలిమ్స్ యుట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న వారే. అందులో ఉన్న మంచి చెడు వారికి భాగా తెలుసు. తాజాగా ఈ ప్రొడక్షన్స్ నుంచి మేమ్ ఫేమస్ సినిమా వచ్చింది.

దీనికి మొదటి రోజు నుంచి మిక్సడ్ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్స్ పరంగా పరవాలేదనిపించుకున్నాయి. కాని నిర్మాతలు జాతిరత్నాలు రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తే సినిమా కంటెంట్ అంత రీచ్ లేదు.

దీంతో ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారం వలనే అని వారు డిసైడ్ అయినట్లు ఉన్నారు. దీంతో మీడియా ముందుకొచ్చి సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం, ట్రోలింగ్ చేసే వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రోలింగ్ చేసే వారు ఇలా సోషల్ మీడియాలో కాకుండా డైరెక్ట్ గా వచ్చి తమతో మాట్లాడాలని, దీనికోసం ఒక వెన్యూ ఏర్పాటు చేసి చర్చిద్దామంటూ చాలెంజ్ చేశారు.

కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొత్త ఆలోచనలతో సినిమా చేస్తే ట్రోలింగ్, దుష్ప్రచారం చేస్తూ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. నిర్మాత శరత్, దర్శకుడు సుమంత్ ప్రభాస్ మీడియా ముందుకొచ్చి తమ సినిమాపై జరుగుతోన్న నెగిటివ్ ప్రచారంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమ్ ఫేమస్ సినిమాకి వారు కోరుకునేంత హైప్ రాకపోవడానికి ఈ దుష్ప్రచారమే కారణమని డిసైడ్ అయ్యి ఇలా కొత్త పంచాయితీకి తెరతీసినట్లు తెలుస్తోంది.