Begin typing your search above and press return to search.

పాతికేళ్లకు సినిమా తీయడమే సక్సెస్..!

By:  Tupaki Desk   |   28 May 2023 11:11 AM GMT
పాతికేళ్లకు సినిమా తీయడమే సక్సెస్..!
X
యూత్ ఆడియన్స్ ని ఒక ఏజ్ లో బాగా కనెక్ట్ అయ్యేది సినిమానే.. సినిమా చూసి ఎంజాయ్ చేసి లైట్ తీసుకునే వారు కొందరైతే ఆ సినిమానే తమ ప్రొఫెషన్ గా మార్చుకోవాలని అనుకునే వారు మరికొంతమంది. అయితే అలా ఏదో ఒక సినిమా చూసి తాను ఒక ఫిల్మ్ మేకర్, స్టార్ హీరో అవ్వాలని కలలు కని ఇండస్ట్రీకి వస్తారు. అలా వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారని కూడా చెప్పలేం. అయితే ఒకప్పటి సినిమా ఛాన్స్ అందుకోవడం అంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువవడం వల్ల ఛాన్స్ లు కూడా ఎక్కువయ్యాయి.

ఈ క్రమంలోనే తమ టాలెంట్ ని ఎవరో గుర్తించి ఛాన్స్ ఇవ్వడం కాదు తమకు తామే అవకాశాలు సృష్టించుకోవాలి అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లిస్ట్ లో పట్టుమని పాతికేళ్లు లేకుండా వచ్చి సినిమాలు తీస్తున్న వారు ఉన్నారు. వారిలో లేటెస్ట్ గా రిలీజైన మేం ఫేమస్ సినిమా డైరెక్టర్ కం హీరో సుమంత్ ప్రభాస్ కూడా ఉన్నాడు. యూట్యూబర్ గా స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఆడియన్స్ ని అలరించిన సుమంత్ ప్రభాస్ తన దగ్గర ఉన్న కథతో చాయ్ బిస్కెట్ వారిని ఒప్పించి మేమ్ ఫేమస్ సినిమా తీశాడు. సినిమా తీయడం మాత్రమే కాదు అది ఆడియన్స్ లోకి వెళ్లేలా దాదాపు అందరు యువ హీరోలని వాడుకుని బీభత్సమైన ప్రమోషన్స్ చేశాడు.

రీసెంట్ గా రిలీజైన మేమ్ ఫేమస్ సినిమా టాక్ పరంగా జస్ట్ ఓకే అనిపించేలా ఉన్నా.. ఈ ఏజ్ లో సుమంత్ ప్రభాస్ చేసిన రిస్క్ కి మెచ్చుకుని తీరాల్సిందే అని చెప్పొచ్చు. కేవలం నటుడిగా తన పని తాను చేసుకుపోవడం వేరు కానీ డైరెక్టర్ గా అంటే ఎంతోమందిని మ్యానేజ్ చేయాలి సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తి చేసి రిలీజ్ చేసే వరకు మొత్తం బాధ్యత తన మీదే ఉంటుంది. అలాంటిది హీరో కమ్ డైరెక్టర్ గా సుమంత్ ప్రభాస్ తనకు మించిన భారమే పెట్టుకున్నాడు.

అయినా కూడా సినిమాకు జస్టిఫికేషన్ చేశాడని చెప్పొచ్చు. మేం ఫేమస్ సినిమా తెలంగాణా పల్లెలో యూత్ బ్యాక్ డ్రాప్ తో వచ్చింది. అయితే ఈ సినిమాకు ముందు జాతిరత్నాలు, బలగం సినిమాలు రావడం ఈ సినిమాపై కొంత ఇంప్యాక్ట్ ఏర్పరిచాయని చెప్పొచ్చు. ముఖ్యంగా బలగం సినిమా ఎఫెక్ట్ ఈ సినిమాపై పడిందని తెలుస్తుంది. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అనే కమర్షియల్ లెక్కలు పక్కన పెడితే పాతికేళ్ల వయసులో కెరీర్ సెట్ రైట్ చేసుకునేందుకు సుమంత్ ప్రభాస్ చేసిన ఈ సిన్సియర్ అటెంప్ట్ నిజంగానే ప్రశంసించదగినది. అందరు గొప్ప సినిమా తీయాలని అనుకుంటారు కానీ అడుగు ముందుకేసి తీసిన వారే గొప్ప వాళ్లు అవుతారు. సో రిజల్ట్ పక్కన పెడితే సినిమా తీయడమే ఒక విజయంగా చెప్పుకోవచ్చు.