Begin typing your search above and press return to search.

సినిమాల్లేక వెబ్ సిరీస్ లోకి హనీ బేబీ..!

By:  Tupaki Desk   |   5 April 2020 4:30 AM GMT
సినిమాల్లేక వెబ్ సిరీస్ లోకి హనీ బేబీ..!
X
మెహ్రీన్ పిర్జాదా.. ఈ పేరు వింటే మొదటగా తెలుగులో 'కృష్ణగాడి వీరప్రేమగాథ' మూవీలో చబ్బీ అమ్మాయి లంగావోణీలో గుర్తొస్తుంది. అలాంటి మెహ్రీన్ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఫేట్ మారిపోయింది అనుకున్నారు అంతా. ఆమె కోసం వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలాంటిది ఇపుడు మెహ్రీన్ ఊసే వినిపించడం లేదు. మొన్నటి 'ఎంతమంచి వాడవురా' వరకు తెలుగు తెరపై కన్పించిన ఈ ముద్దుగుమ్మ ఏమైపోయింది మరి. తెలుగే కాదు అసలు ఏ భాషలోనూ ఆమె పేరు వినిపించట్లేదు. అందం బోలెడంత ఉంది. అభినయం ఉంది. ఎంత అందాల ఆరబోత చేసినా అదృష్టం మాత్రం ఇసుమంత కూడా మెహ్రీన్ కెరీర్ లో కన్పించడం లేదు. రాజా ది గ్రేట్ - ఎఫ్2 లాంటి హిట్స్ ఉన్నా అమ్మడికి హిట్స్ వెనకే ప్లాప్స్ ఫాలో అవుతున్నాయి.

చివరిగా నాగశౌర్య అశ్వద్ధామలో కన్పించిన మెహ్రీన్ మళ్లీ తెరపై మెరవలేదు. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తుందట. బి టౌన్ లో ఇపుడు వెబ్ సిరీస్ లకు మంచి గిరాకీ ఉంది. బోల్డ్ సీన్స్‌ లో నటించేందుకు హీరోయిన్లు ఆసక్తి చూపించడంతో వెబ్ సిరీస్‌ లకు భలే ఆదరణ ఏర్పడింది. మెహ్రీన్ తమ్ముడు గుర్ఫతే సింగ్ ఫిర్జాదా బాలీవుడ్‌ లో ‘గిల్టీ’ అనే వెబ్ సిరీస్‌ లో నటించాడు. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆ పాపులారిటీతోనే గుర్ఫతే - తన అక్క మెహ్రీన్ కి ఓ వెబ్ సిరీస్‌ లో అవకాశం ఇప్పించినట్టు టాక్ నడుస్తోంది. నెట్‌‌ ఫ్లిక్స్‌ లో ప్రసారమయ్యే ఈ వెబ్ సిరీస్‌ లో మెహ్రీన్ ఎలా కనిపిస్తుందో, ఎంతలా బీటౌన్ జనాలను ఆకట్టుకుంటుందో చూడాలని ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. మరి ఈ వెబ్ సిరీస్‌ తోనైనా మెహ్రీన్ బ్యాడ్ లక్ దూరం అవుతుందేమో.. అధికారిక ప్రకటన వెలువడే వరకు వెయిట్ చేయాల్సిందే!