ఎడారిలో సాహసం.. మెహ్రీన్ ఆ స్పాట్ ఎక్కడ?

Sat Mar 06 2021 12:14:05 GMT+0530 (IST)

Mehreen Pirzada Stunning Look At Desert

ఎఫ్ 2 సక్సెస్ తర్వాత మెహ్రీన్ యువహీరోల సరసన నటించినా ఉపయోగం లేకుండా పోయింది. ఆశించిన హిట్టు రాక కెరీర్ పరంగా పూర్తిగా వెనకబడింది. ఆ క్రమంలోనే క్రైసిస్ సమయంలో స్వస్థలానికి వెళ్లిపోయిన మెహ్రీన్ మళ్లీ అనీల్ రావిపూడితో కలిసి హైదరాబాద్ లో ప్రత్యక్షమైంది.ఎఫ్ 3 కి కమిటయ్యాక.. ఓవైపు అనీల్ రావిపూడితో కలిసి బిగ్ బాస్ 4-తెలుగు గ్రాండ్ ఫినాలే వేదికపై సందడి చేసింది. రియాలిటీ షోలో ఓ మెడ్లీ సాంగ్ కి పెర్ఫామ్ చేసింది. ప్రస్తుతం నటిస్తున్న ఎఫ్ 3 ఒక రకంగా మెహ్రీన్ కి కంబ్యాక్ లాంటిది.

ఇక ఎఫ్ 2లో హనీ ఈజ్ ద బెస్ట్! అంటూ బోలెడంత హంగామా చేసిన మెహ్రీన్ సీక్వెల్లోనూ అదరగొట్టనుందని సమాచారం. ఈ భామ ప్రస్తుతం  ఎడారిలో సాహస యాత్రకు వెళ్లింది. ఇదిగో ఇలా ఆఫ్ఘన్ ని తలపించేలా టాప్ టు బాటమ్ ముసుగు ధరించి స్పెషల్ రైడ్ కి వెళ్లిన ఫోటో అంతర్జాలంలో వైరల్ అవుతోంది. 60 నంబర్ ఎడారి స్టార్మ్ రైడర్ వెహికల్ పై అదరగొడుతున్న ఈ బ్యూటీ ఆ స్పాట్ ఏదో చెప్పనే లేదు.

అప్పటికీ ఒక అభిమాని జైసల్మేర్ లో ఉన్నావా?  స్పాట్ ఎక్కడ? అంటూ అడిగేశాడు. దానికి రిప్లయ్ కూడా ఇవ్వలేదు ఈ బ్యూటీ. ఈ హంగామా చూస్తుంటే మెహ్రీన్ ఏదో యాడ్ షూట్ లో పాల్గొందా.. లేక ఎఫ్ 3 షూటింగ్ స్పాట్ నుంచేనా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇక మెహ్రీన్ ఇటీవలి వరుస ఫోటోషూట్ల వ్యవహారం ఇన్ స్టా పోస్టింగుల్ని చూస్తుంటే కోల్గేట్ సహా పలు కార్పొరెట్ బ్రాండ్లతో భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుందని అర్థమవుతోంది.