చరణ్ గురించి మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Sat Oct 01 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

Megastar's interesting comments about Charan!

మెగాస్టార్ చిరంజీవి-మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య'  డిజాస్టర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా సినిమా వాటిని అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. తొలిసారి వెండి తెరపై చిరు-చరణ్ కలిసి నటించడంతో?  బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు లిఖిస్తుందని రిలీజ్ కి ముందు అంచనాలు నెలకొన్నాయి.కానీ  తొలి షోతోనే సత్తా లేని సినిమా గా తేలిపోయింది. సినిమా చరిత్రలోనే మెగా ఇమేజ్ ని డ్యామేజ్ చేసిన చిత్రంగా నిలిచిపోయింది. ప్రేక్షకులు సహా మెగా కుటుంబాన్ని తీవ్ర నిరాశకు గురి చేసిన చిత్రమిది. భర్త..తనయుడ్ని ఒకే ప్రేమ్ లో చూడాలని సురేఖ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ ఆమె కోరిక నెరవేరినా? పరాజయం  మాత్రం ఎంతో నిరుత్సాహపరిచింది.

ఎప్పుడూ విదేశాలకు టూర్ వెళ్లని మెగా దంపతులు ఈ సినిమా నుంచి ఉపశమనం కోసం అమెరికా ట్రిప్ వెళ్లారు. ఓ వారం పాటు ఆచార్య జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు వేసిన ట్రిప్ ఉపశమనాన్ని ఇచ్చింది.   ఇలా 'ఆచార్య' సురేఖని సైత ఎంతో డిస్టబెన్స్ కి గురిచేసింది. తాజాగా గాడ్ ఫాదర్ ప్రమోషన్ లో బిజీగా ఉన్న చిరంజీవి ఆచార్య గురించి ముచ్చటించారు.

'ఆచార్య వైఫల్యం నన్ను..చరణ్ ని పెద్దగా బాధించలేదు. కొరటాల శివ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ వాళ్ల అంచానలు కూడా ఈసారి తప్పాయి. అందుకు ఎవర్నీ నిందించాల్సిన పనిలేదు. సినిమా కోసం అంతా సమిష్టిగా పనిచేసాం. విజయం..అపజయం అందరికీ సమానమే' అన్నారు.

అయితే కుమారిడితో కలిసి నటించిన మొదటి సినిమానే ప్లాప్ అవ్వడం అన్నది కొంత నిరుత్సాహాన్ని కల్గించింది. భవిష్యత్ లో మళ్లీ చరణ్ తో కలిసి పనిచేస్తున్నప్పుడు  అతనిలో మునపటి అంత  ఉత్సాహాన్ని చూడలేకపోచ్చు అని చరణ్ ని ఉద్దేశించి చిరంజీవి అన్నారు. అంతేగా! విజయం ఉత్సాహాన్ని నింపితే...అపజయం నిరుత్సాహాన్ని కూడగడుతుంది.

ఆచార్య విషయంలో చిరంజీవి వ్యాఖ్యలకు అదే అర్ధం వస్తుంది. మెగాస్టార్ గా ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. నటుడిగా తనకంటూ  సినిమా చరిత్రలో ఓ పేజీ రాసిపెట్టారు. మెగా వారసత్వంతో ఎంతో మంది స్టార్లు పరిచయం అవుతున్నారు.  వాళ్ల  బ్రాండ్ తో మరికొంత మంది తెరపైకి వస్తున్నారు. కానీ మెగా వృక్షాన్ని నాటిన చిరంజీవి.. ఆచెట్టు కోమ్మ చరణ్ కలిసి నటించిన సినిమా మాత్రం ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశ పరిచింది. రికార్డలు తిరగరాయాల్సిన సినిమా కనీసం చర్చించుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.