భోళా శంకర్ ఉగాది స్పెషల్.. రిలీజ్ పై మరో క్లారిటీ

Tue Mar 21 2023 22:02:20 GMT+0530 (India Standard Time)

Megastar bhola shankar movie update

మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోయే చిత్రం భోళా శంకర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పవచ్చు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మెగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాన మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. ఇక క్రియేటివ్ కమర్షియల్స్తో కలిసి అనిల్ సుంకర యొక్క ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు.భోలా శంకర్ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గానే కాకుండా డిఫరెంట్ యాక్షన్ ఎమోషన్స్ ఇతర ఎలిమెంట్స్ మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్ గా ఉంటుందని దర్శకుడు రమేష్ హామీ ఇస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా భాటియా కథానాయికగా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా నటించింది. ఇక సుశాంత్ చాలా ప్రత్యేకమైన లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్నాడు.

ఇక భోళా శంకర్ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సెలవుతో లాంగ్ వీకెండ్లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా సినిమాను విడుదల చేయబోతున్నారు. అదే నెల 22న చిరంజీవి పుట్టినరోజు కూడా కావడంతో మెగాస్టార్ అభిమానులకు ఇది మరింత ప్రత్యేక సందర్భం. ఉగాది సందర్భంగా ఒక స్పెషల్ లుక్ కూడా విడుదల చేశారు. చిరంజీవి కీర్తి సురేష్  తమన్నా భాటియా సంప్రదాయ దుస్తులలో ఆహ్లాదకరమైన చిరునవ్వులతో చిందిస్తూ కనిపించారు.

ఈ చిత్రంలో రఘుబాబు మురళీ శర్మ రవిశంకర్ వెన్నెల కిషోర్ తులసి శ్రీ ముఖి బిత్తిరి సతి సత్య గెటప్ శ్రీను రష్మీ గౌతమ్ ఉత్తేజ్ అలాగే ఇతర ప్రతిభావంతులైన తారాగణం ఉంది. ఇక భోళా శంకర్ యొక్క సాంకేతిక సిబ్బంది విషయానికి వస్తే.. డడ్లీ కెమెరా క్రాంక్ మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఇక ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేస్తున్నారు. సత్యానంద్ కథా పర్యవేక్షణ తిరుపతి మామిడాల సంభాషణలు అందించారు.  మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.