మెగాస్టార్ ఫోకస్ ఆ బోల్డ్ డైరెక్టర్ పై పడిందా?

Fri Mar 24 2023 12:00:01 GMT+0530 (India Standard Time)

Megastar Focus on Director Sandeep Reddy Vanga

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సందీప్ రెడ్డి బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అదే మూవీని కబీర్ సింగ్ గారి మేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తర్వాత బాలీవుడ్ లోనే రణబీర్ కపూర్ కి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు.  ఏకంగా బడ నిర్మాణ సంస్థ అయిన టి సిరీస్ లో యానిమల్ సినిమాని ప్రస్తుతం తెరకెక్కిస్తున్నాడు.ఈ మూవీ షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేస్తుంది. ఆగస్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో యానిమల్ సినిమాని రిలీజ్ చేయబోతూ ఉండటం విశేషం. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమాని చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ సినిమాని కూడా టి సిరీస్ లోనే చేయబోతూ ఉండటం విశేషం.

 ఇక ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ తో మరో సినిమాని సందీప్ రెడ్డి కన్ఫామ్ చేసుకున్నారు.  ఇవన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోయే సినిమాలే కావడం విశేషం. అర్జున్ రెడ్డి సినిమా సందీప్ రెడ్డి ఇమేజ్ ని అమాంతం పెంచేసింది అని చెప్పాలి.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా తన డైరెక్షన్ లైన్ అప్ లో చేర్చుకోవడానికి సందీప్ రెడ్డి రెడీ అవుతున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిని కలిసి కథ చెప్పబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. తన అభిమాన హీరో చిరంజీవికి కథ చెప్పి ఒప్పిస్తానని నమ్మకంతో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.

ఇక అర్జున్ రెడ్డి సినిమా డైరెక్షన్ విషయంలో చిరంజీవి కూడా సందీప్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి తనని తాను కొత్తగా ఎలివేట్ చేసుకునే క్రమంలో పాన్ ఇండియా కథల కోసం కూడా చూస్తున్నారు.  ఒకవేళ సందీప్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లయితే కచ్చితంగా అది సెన్సేషన్ అవుతుంది.

ఇప్పటికే ఈ దర్శకుడి జాబితాలో ప్రభాస్ అల్లు అర్జున్ చేరిపోగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా ఉన్నట్లుగా సమాచారం.  రీసెంట్ గా అతనికి కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మెగస్టార్ తో సినిమా చేయడానికి తన దగ్గర మంచి  స్టోరీ లైన్ ఉందని సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూలో పేర్కొనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.