నేడు గడికోట సంస్థానానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు

Sun Dec 05 2021 14:05:49 GMT+0530 (IST)

Megastar Chiranjeevi and family members to Gadikota Sansthan

కామారెడ్డి జిల్లా గడికోట సంస్థానాధీశులు కామినేని అనిల్ కుమార్ శోభనల రెండో కూతురు అనుష్పాల వివాహం సందర్భంగా ఆదివారం దోమకొండలో పోచమ్మ పండగ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం హాజరుకానుంది. దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో జరిగే కార్యక్రమంలో పాల్గొననుంది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన ఇతర కుటుంబ సభ్యులు కూడా గడికోటకు వెళ్లనున్నారు.ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడనున్న రామ్ చరణ్ మరదలు మెగాస్టార్ రామ్ చరణ్ మరదలు.. ఉపాసన చెల్లెలు అనుష్పాల. అచ్చం అక్కలాగే.. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడ బోతోంది. అతడు కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీం. వరుడు తమిళనాడులోని చెన్నైకి చెందిన కుటుంబం. వీరి పెళ్లి వేడుకలకు ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కొత్త జంటను ఆశీర్వదించడానికి హిజ్రాలు విచ్చేశారు. మరోవైపు వివాహం నేపథ్యంలో పోచమ్మ పండుగ కు  చిరంజీవి ఫ్యామిలీ తో పాటు కామినేని అపోలో కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. దీంతో ఇప్పటికే గడి కోట వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అతడు కార్ రేసర్.. కుటుంబ నేపథ్యమూ ఘనమే రేసర్ అర్మాన్ ఇబ్రహీం-అనుష్పాల కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. అర్మాన్.. మాజీ ఇండియన్ ఫార్ములా 3 ఛాంపియన్ అక్బర్ ఇబ్రహీం తనయుడు. ఇబ్రహీం కార్ రేసర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని కార్ రేసర్ గా రాణిస్తున్నాడు అర్మాన్. ఇప్పటికే ఆ రంగంలో పాపులారిటీ సంపాదించాడు. మరోవైపు అనుష్పాల అక్క ఉపాసనతో కలిసి అపోలో సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. కాగా  అపోలో గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి.. దోమకొండ కోటకు చెందిన ఉమాపతి రావులకు అనుష్పాల మనవరాలు. శోభన- అనిల్ కామినేనిల రెండో కూతురు.