మైండ్ బ్లాంక్ చేయిస్తోన్న చరణ్ లైనప్

Mon Mar 27 2023 21:55:44 GMT+0530 (India Standard Time)

Megapowerstar ramcharan movie lineup

రామ్ చరణ్ తేజ్.. చిరు తనయుడిగా ఇండ్రస్ట్రీలోకి అడుగు పెట్టి... ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన రామ్ చరణ్.. రెండవ సినిమాతో అప్పటివరకు ఉన్న రికార్డులన్ని కొల్లగొట్టారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీరతో.. మంచి క్రేజ్ను సంపాదించుకున్న తర్వాత వరుస సినిమాలతో మెప్పించాడు.  ఇక మొన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. రాజమౌళి దర్శకత్వంలె తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. నాటు నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డు రావడం... ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ను తెచ్చిపెట్టింది. అయితే రామ్ చరణ్ లైనప్ ఒకసారి పరిశీలిస్తే.. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది.  

దిల్ రాజు నిర్మాతగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 రాబోతున్న తెలిసిందే. ఈరోజు పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ కూడా రివిల్ చేశారు. గేమ్ ఛేంజర్ అంటూ ప్రకటించారు. ఇక ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. కియారా అడ్వానీ అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఇక సుకుమార్ శిష్యూడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. ప్రస్తుతం ఆర్సీ 16 వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈరోజు బర్త్డే సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరింత సమచారాన్ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తన 17వ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణంలో రామ్ చరణ్ తన 18వ చేయనున్నట్లు తెలిస్తోంది. ఇలా వరుస సినిమాలతో రామ్ చరణ్ బిజీ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.