మెగా ఇంట సంక్రాంతి సంబరం అంబరాన్నంటేలా!

Sat Jan 15 2022 11:00:01 GMT+0530 (IST)

Megafamily Sankranti Celebrations

పండగల వేళ మెగా అల్లు ఫ్యామిలీస్ ఓ చోట చేరి సరదాగా సంబరాల్ని చేసుకోవడం ప్రతిసారీ చూసేదే. మెగా బ్రదర్స్ తో పాటు అల్లు ఫ్యామిలీ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటుంది. దసరా దీపావళి సంక్రాంతి లను చిరు అస్సలు మిస్ చేయరు. ఆ రోజు కుటుంబంతో సమయం గడపడం కోసమే ప్రాధాన్యతనిస్తారు. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ రీయూనియన్ ఫెస్టివల్ గా చూస్తారు. చిరంజీవి కుటుంబ సమేతంగా శుక్రవారం నాడు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలతో మొదలు పెట్టి నేడు సంక్రాంతి ఫర్వదినాన్ని పూజా కార్యక్రమాలతో గొప్పగా జరుపుకుంటున్నారు.ఈ పండగలో తన సోదరులు.. సోదరీమణులు.. పిల్లలు.. మేనల్లుళ్లు.. మేనకోడళ్లు.. మనవరాళ్లు అందరూ సందడిగా గడిపేస్తుంటే.. చిరంజీవి సహా మొత్తం కుటుంబ సభ్యులను కెమెరాలో బంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ చిరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ఉపయోగించిన  రోవింగ్ కెమెరా తన కుమారుడు రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ కోసం ఉపయోగించారు.

మెగా స్టార్ తల్లి  అంజనా దేవి గారు..  సోదరుడు నాగబాబు.. కోడలు ఉపాసన- కుమార్తెలు- భార్య- అల్లుళ్లు - అల్లు అరవింద్ (అల్లు అర్జున్ తండ్రి)..  వరుణ్ తేజ్ తదితరులు వీడియోలో ఉన్నారు. ఈ వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దానికి ఎనలేని వ్యూస్ వస్తున్నాయి. ప్రతిసారీ సంక్రాంతి వేడుకల్ని బెంగళూరు ఫామ్ హౌస్ లో నిర్వహించేవారు. కానీ ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో చిరు స్వగృహంలోనే వేడుకలు జరుగుతున్నాయి.