మెగాకోడలు ఉపాసన పై మెగాబ్రదర్ సంచలన వ్యాఖ్యలు..!

Fri Jun 18 2021 15:00:02 GMT+0530 (IST)

Megabrother sensational comments on Upasana

కరోనా లాక్డౌన్ కారణంగా సినీ సెలబ్రిటీలు అందరూ ఎవరిళ్లకు వారే పరిమితమయ్యారు. ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సందేశాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు కూడా అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు. అంటే రావాలని అనిపించినప్పుడు వస్తా అన్నట్లుగా నాగబాబు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంటాడు. కొన్నిసార్లు వివాదాలలో కూడా చిక్కుకుంటారు. కానీ ఈసారి ఆయన మాట్లాడింది ఇండస్ట్రీ గురించి కాదు. మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన గురించి పలు విషయాలు బయటపెట్టారు.నాగబాబు కారణంగా మరోసారి మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన వార్తల్లో మళ్లీ హైలైట్ అయింది. ఉపాసన ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో సామాజిక అంశాల పై స్పందిస్తూ.. ఎప్పటికప్పుడు హెల్త్ తో పాటు తన కుటుంబ విషయాలు కూడా తెలియజేస్తూ ఉంటుంది. మెగా ఫ్యామిలీ కోడలిగా ఇంటి బాధ్యతలతో పాటు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు కూడా చూసుకుంటుంది. అంతేగాక తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ తనకు తెలిసిన చిట్కాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తుంది.

తాజాగా నాగబాబు ఉపాసన గురించి మాట్లాడుతూ.. " ఉపాసన అంతపెద్ద అపోలో హాస్పిటల్స్ నుండి కరోనా టైంలో చాలా తక్కువ ఖర్చులకు ట్రీట్మెంట్ అందించడంలో ప్రముఖ పాత్ర పోషించిందని తెలిపాడు. అలాగే అంత తక్కువ ఖర్చుకు ఎలా సాధ్యం అవుతుందని అడిగితే.. ఇలాంటి సమయంలోనే కదా సహాయం చేయాల్సింది అంటూ చెప్తే ఆమె గొప్పతనం అర్థమై చాలా ఆనందంగా ఫీల్ అయినట్లు చెప్పాడు. ఆ విధంగా మెగాస్టార్ కోడలు అనిపించుకుంది అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే సినీ కార్మికులకు వాక్సినేషన్.. కార్యక్రమంలో కూడా ఉపాసన హెల్ప్ ఉందని తెలిపాడు. అయితే ఉపాసన సేవాగుణం గురించి ఆల్రెడీ జనాలకు మెగా అభిమానులకు తెలిసిందే. ఆమె కరోనా టైంలో శ్రీశైలం పరిసరాల్లోని గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఉపాసన విషయంలో ఖుషీ అవుతున్నారు.