పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ స్టోరీకి నాగబాబే కారణమా...?

Sat May 30 2020 05:00:04 GMT+0530 (IST)

Nagababe is responsible for Pawan Kalyan's Failure Story ...?

సినీ నటుడు - జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు వివాదాదస్పద ట్వీట్లతో తరచుగా విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ మీద ఏదైనా న్యూస్ వస్తే తప్పొప్పులు ఆలోచించకుండా నాగబాబు చాలా వేగంగా వాటిపై స్పందిస్తూ ఉంటారు. సినిమాల నుండి రాజకీయాలలోకి వచ్చినా నాగబాబు తీరు మాత్రం మారలేదని ఆయనపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని.. అన్న చిరంజీవిని ఎవరైనా కామెంట్ చేసారని తెలిసినా వెంటనే రియాక్ట్ అవుతుంటాడనేది అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు నాగబాబే వారిద్దరికీ పెద్ద సమస్యగా మారుతున్నాడట. గత ఎన్నికలలో జనసేన తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిన నాగబాబు ఈ మధ్య అన్ని విషయాలలో తల దూరుస్తూ అటు పవన్ - చిరులకు ఇటు జనసేన పార్టీకి తలనొప్పిగా మారుతున్నాడని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.ఈ మధ్య గాంధీని చంపిన గాడ్సే గొప్ప దేశభక్తుడని కామెంట్ చేసి జనసేన అధినేతను ఇరుకున పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ తరపున నాగబాబు వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని.. ఆయన వ్యక్తిగతమని వివరణ ఇచ్చే దాకా వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత ఇబ్బందులు తెస్తున్నాడో అని అంటున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఫెయిల్ అవడానికి ముఖ్య కారణం కూడా నాగబాబే అని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. 2014 ఎన్నికలలో జనసేన పార్టీ.. టీడీపీ బీజీపీలకు సపోర్ట్ చేయడంలో నాగబాబు కీ రోల్ ప్లే చేసాడని అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. నాలుగేళ్లు టీడీపీ ప్రభుత్వంతో కాపురం చేసి.. చివరి ఏడాదిలో యూ టర్న్ తీసుకొని నాగబాబుతో ఎమోషనల్ గా మాట్లాడించారని అప్పటి ప్రతిపక్షం ఆయనపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఇప్పుడు నాగబాబు వెనకేసుకొస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని.. అప్పట్లో పవన్ కళ్యాణ్ విపరీతంగా తిట్టడంలో నాగబాబు పాత్ర ఉందని సోషల్ మీడియా వేదికగా చాలా మందే విమర్శలు గుప్పిస్తున్నారు. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జగన్ ని విమర్శించడంలో కూడా నాగబాబు ఉన్నాడని.. కాకపోతే అది బూమరాంగ్ అయి జనసేనకే తగిలిందని.. టీడీపీ దగ్గర డబ్బులు తీసుకొని ఇండైరెక్ట్ గా వారికి జనసేన సపోర్ట్ చేస్తోందని అందరూ అనుకునేలా చేసాడని.. అందుకే ఆ ఎన్నికలలో జనసేన ఘోర పరాజయం పాలైందని నెటిజన్స్ ఇప్పటికీ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. కాగా నిన్న బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు 'గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సామాన్యుల జీవితాలు సర్వనాశనం అయిపోయాయి.. ఇన్ సైడ్ ట్రేడింగ్ తో అమరావతి ప్రాంతాన్ని మీ తెలుగుదేశం పార్టీ సర్వనాశనం చేసిందని' విమర్శలు చేసారు.

ఇప్పుడు దీనిపై కూడా నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'అప్పట్లో టీడీపీ ప్రభుత్వంతో మీ జనసేన పార్టీ కూడా కలిసి ఉంది కదా.. అమరావతి రైతుల దగ్గర 33 వేల ఎకరాలు తీసుకుంటే మెగా బ్రదర్స్ ఇద్దరూ నోరు మెదపలేదని.. ఇప్పుడేమో ఏపీలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ క్లారిటీ లేని పాలిటిక్స్ చేస్తున్నాడని' అని నెటిజన్స్ నాగబాబు మీద విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక పక్క తెరాసా ప్రభుత్వాన్ని పొగుడుతూ ఏపీలో వైసీపీని పొగుడుతూ మెగా బ్రదర్స్ మళ్ళీ బూమరాంగ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద నాగబాబు మెగా బ్రదర్స్ ఇద్దరికీ తలనొప్పిగా మారుతున్నాడని.. జనసేన అధినేత పొలిటికల్ ఫెయిల్యూర్ కి కారణమవుతున్నాడని వారిని అభిమానించే కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.