Begin typing your search above and press return to search.

'ఆచార్య' మెగా మాస్ ఫీస్ట్ రెడీ..!

By:  Tupaki Desk   |   2 April 2022 4:30 PM GMT
ఆచార్య మెగా మాస్ ఫీస్ట్ రెడీ..!
X
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ''ఆచార్య'' సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలిసారిగా మెగా తండ్రీకొడుకులు స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - గ్లిమ్స్ - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. అలానే 'లాహే లాహే' 'నీలాంబరి' 'సానా కష్టం' పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి.

'ఆచార్య' చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 29న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే రెగ్యులర్ గా ఈ సినిమా నుండి అప్‌డేట్స్ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఉగాది పండగ సందర్భంగా ఏదైనా అప్‌డేట్ ఉంటుందని ఆశించారు.

ఈ నేపథ్యంలో ఆచార్య మేకర్స్ ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ తో ముందుకు వచ్చారు. రాబోయే రోజుల్లో అగ్రిసివ్ గా ప్రమోషనల్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్న చిత్ర బృందం.. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే మాస్ ఫీస్ట్ అనౌన్స్ మెంట్ ఉంటుందని వీడియో ద్వారా వెల్లడించారు.

'ఆచార్య' సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే సందడి చేయనుంది. రెజీనా కాసాండ్రా - సంగీత ప్రత్యేక గీతాల్లో కనిపించగా.. సోనూసూద్ - జిషు సేన్ గుప్తా - వెన్నెల కిశోర్ - పోసాని కృష్ణ మురళి - తనికెళ్ళ భరణి - సౌరవ్ లోకేష్ - అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. తిరునవుక్కరసు సినిమాటోగ్రఫీ అందించగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కొరటాల శివ తనదైన మార్క్ సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా 'ఆచార్య' ను రూపొందిస్తున్నారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో దేవాదాయ భూముల కుంభకోణం గురించి ప్రస్తావించబోతున్నారని టాక్. ట్రైలర్ రిలీజ్ అయితే సినిమా నేపథ్యం ఏంటో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇకపోతే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. పెన్ స్టూడియోస్ సంస్థ 'ఆచార్య' చిత్రాన్ని నార్త్ ఇండియా ప్రేక్షకులకు అందించనున్నారు .