Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పుట్టినరోజున సర్ ప్రైజ్ ఇచ్చిన చిరంజీవి

By:  Tupaki Desk   |   28 May 2020 8:10 AM GMT
ఎన్టీఆర్ పుట్టినరోజున సర్ ప్రైజ్ ఇచ్చిన చిరంజీవి
X
మెగా స్టార్ చిరంజీవి.. దిగ్గజ సీనియర్ ఎన్టీఆర్.. ఇద్దరూ వారి వారి తరాల్లో అగ్రగణ్యులు. సినిమా ఇండస్డ్రీని ఏలిన వారే. అలాంటి దిగ్గజాలు కలిసి నటించారు. అభిమానులకు వీనుల విందును అందించారు. సీనియర్ ఎన్టీఆర్ బర్త్ డే ఈరోజు. ఆయన పుట్టినరోజున చిరంజీవి సర్ ప్రైజ్ ఇచ్చాడు.

చిరంజీవి సోషల్ మీడియాలోకి ప్రవేశించడంతో ఈ మధ్య యాక్టివ్ అయ్యారు. అనేక విషయాలపై తన ప్రతిస్పందనలు తెలియజేస్తున్నారు. తొలిసారి ఎన్టీఆర్ గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆయనతో జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా ట్విట్టర్ ద్వారా చిరంజీవి వారిద్దరికి సంబంధించి ఓ అరుదైన ఫొటోను షేర్ చశారు. ఒకరినొకరు కలిసి నటించిన ఈ చిత్రంలో స్వీట్ ఇద్దరూ ఒకరినొకరు నోట్లో పెట్టుకొని సంతోషంగా కనిపించారు. ఈ సందర్భంగా ఆ ఫొటోను షేర్ చేసిన చిరంజీవి ‘‘తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం.. తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ...’’ అంటూ గొప్ప వ్యాఖ్యలతో ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఫొటో ఎన్టీఆర్ పట్ల చిరంజీవికి ఉన్న అపారమైన గౌరవాన్ని తెలియజేస్తోంది. నందమూరి హీరో ఇలా పాత ఫొటోతో నివాళులర్పించడం ఆకట్టుకుంది. ఈ ఫొటో 1981లో ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించిన ‘తిరుగులేని మనిషి’ చిత్రం సందర్భంగా తీసింది.