మెగా షాక్: కేవలం ఐదు రోజుల గ్యాప్ లోనే

Sat Oct 23 2021 11:00:01 GMT+0530 (IST)

Mega Shock Just five days apart

మెగా స్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆచార్య చిత్రీకరణ పూర్తయింది. గాడ్ ఫాదర్ తెరకెక్కుతోంది. ఈలోగానే మరో ఇద్దరు దర్శకులను ఫైనల్ చేసి సెట్స్ పైకి వెళ్లేందుకు ముహూర్తాలు ఫిక్స్ చేశారు. బాబీతో చిరు తదుపరి చిత్రం నవంబర్ 6న హైదరాబాద్ లో అధికారికంగా ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మాస్ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కథానాయికల్ని ఫైనల్ చేయాల్సి ఉంది. చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది.ఇంతలోనే మరో గుడ్ న్యూస్ అందింది. నవంబర్ 11 న భోళా శంకర్ చిత్రాన్ని పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభిస్తారు. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. నవంబర్ లో హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఓ షెడ్యూల్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2023లో విడుదల కానుంది. కేవలం ఐదు రోజుల గ్యాప్ లోనే రెండు సినిమాల్ని మెగాస్టార్ ప్రారంభిస్తుండడం ఆసక్తికరం.

ఆచార్య సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా.. బాబి మూవీ వాల్టేర్ శీను 2022లో విడుదలవుతుంది. అటుపై 2023 సంక్రాంతికి మెహర్ రమేష్ భోళా శంకర్ విడుదల కానుంని సమాచారం. వీళ్లతో పాటు మారుతి సహా పలువురు దర్శకులు ఇప్పటికే మెగాస్టార్ క్యూలో ఉన్న సంగతి తెలిసిందే. మరో పదేళ్లలో 20 పైగా సినిమాల్లో నటించేంత హుషారుగా చిరు ఉన్నారు