మెగా వెబ్ సైట్ ని లాంచ్ చేసిన మెగా పవర్ స్టార్!

Mon Oct 18 2021 19:00:01 GMT+0530 (IST)

Mega Power Star Launches Mister Chiranjeevi Website

మెగాస్టార్ చిరంజీవి జీవితంపై పుస్తక రచయితలు పలు పుస్తకాల్ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆయన సంపూర్ణ జీవితంలో తెలియని ఎన్నో విశేషాల్ని వెల్లడించేందుకు ఆ పుస్తకాల్లో స్కోప్ చాలా తక్కువ. అలాగే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యకలాపాలకు తెలుగు మీడియాలో సరైన ప్రచారం దక్కని సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వెబ్ సైట్ ద్వారా సాధ్యమైనంతగా చిరుకి సంబంధించిన విషయాల్నిఅప్ డేట్ చేయనున్నారు.`మిష్టర్ చిరంజీవి` పేరుతో వెబ్ సైట్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ లోని చిరంజీవి చారిటిబబుల్ ట్రస్ట్ లో నేడు ప్రారంభించారు. చరణ్ ఈ వెబ్ సైట్ ని స్వయంగా పర్యవేక్షించారు. వెబ్ సైట్ లో పీచర్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. నిర్వహణ విషయంలో ఎంత మాత్రం రాజీ పడేది లేదని మెగా క్యాంప్ నిర్వహించే కార్యక్రమాలన్ని క్రమం తప్పకుండా అప్ డేట్ అవ్వాలని మేనేజమ్ మెంట్ ని సూచించారు. ముఖ్యంగా  చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరిగే సేవా కార్యక్రమాల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించాలని అన్నారు. అయితే అంతకు ముందు చరణ్ ఎంట్రీ తో కాస్త కోలాహాలం చోటు చేసుకుంది.
మీడియాని నిర్వహకులు అదుపు చేయాలని ప్రయత్నించినా చరణ్ చొరవ తీసుకున్నారు. నేరుగా మీడియా మిత్రుల మధ్యలోకి వెళ్లి కూర్చోని..వాళ్ల వివరాలు పేర్లతో సహా తెలుసుకున్నారు.  సెల్ఫీలు దిగకూడదని నిర్వాహకులు కాస్త హడావుడి చేసిన చరణ్ చొరవ తీసుకుని వాళ్లతో కలిసి ఫోటోలు దిగడంపై ఆసక్తి కనబరిచారు. మీడియా మిత్రులందర్నీ అన్నదమ్ముల్లా ట్రీట్ చేసారు. మిత్రులతో  చరణ్ ఫోటోలు దిగి ఆశ్చర్యపరిచారు. అడిగిన వారికి సెల్ఫీలు సైతం ఇచ్చారు.

ఇటీవల చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున కరోనా రోగులకు ఆక్సిజన్ సేవల్ని అందించిన సంగతి తెలిసిందే. దీనికోసం చిరు-చరణ్ బృందం కోట్లాది రూపాయల్ని ఖర్చు చేసింది. కానీ తాము ఇంత చేసినా కానీ తెలుగు మీడియా దానికి సరైన ప్రాచుర్యం కల్పించని సంగతి తెలిసిందే. కరోనా కష్ట కాలంలో మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ని ప్రారంభించి కార్మికులను ఆదుకున్నారు. దానికి కూడా ప్రచారం దక్కకపోగా విమర్శించిన నోళ్లే ఎక్కువ. అందుకే ఇప్పుడు ప్రతిదీ పారదర్శకంగా ప్రజలకు వివరించేందుకు ఈ వెబ్ సైట్ సహకరించనుంది. ఈ వెబ్ సైట్ లో మెగా కాంపౌండ్ సినిమాలకు ప్రమోషన్ చేస్తారా లేదా? అన్నది చూడాలి.