ఢిల్లీలో చరణ్.. మెగా బలగం చూపించిన ఫ్యాన్స్..!

Fri Mar 17 2023 16:11:37 GMT+0530 (India Standard Time)

Mega Fans Power at Delhi For RamCharan

ఆస్కార్ వేడుకల కోసం యూఎస్ వెళ్లిన RRR స్టార్స్ ఇప్పుడు తిరుగు ప్రయాణం పట్టారు. ఇప్పటికే ఎన్.టి.ఆర్ హైదరాబాద్ చేరుకోగా లేటెస్ట్ గా రాం చరణ్ ఇండియాకు వచ్చారు. అయితే చరణ్ మాత్రం హైదరాబాద్ కాకుండా ఢిల్లీలో దిగారు. ఆస్కార్ వేడుకలకు వెళ్లి వచ్చిన చరణ్ కి ఢిల్లీ లో మెగా ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కం చెప్పారు.భారీ అభిమానుల సమక్షంలో చరణ్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి తన హోటల్ కు వెళ్లారు. ఆర్.ఆర్.ఆర్ తో తమ హీరో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నాడని మెగా ఫ్యాన్స్ అంతా సూపర్ హ్యాపీగా ఉన్నారు.

ఇంతకీ చరణ్ ఢిల్లీలో ఎందుకు దిగాల్సి వచ్చింది అంటే ఈరోజు సాయంత్రం ఇండియా టుడే మీటింగ్ లో చరణ్ అటెండ్ అవుతున్నారు. ప్రధాని మోడీ కూడా ఈ మీటింగ్ లో పాల్గొంటున్నారు. ఇండియా టుడే ఆహ్వానం మేరకు చరణ్ ఢిల్లీలో దిగాల్సి వచ్చింది. చరణ్ అక్కడ మీటింగ్ పూర్తి చేసుకుని తర్వాత హైదరాబాద్ చేరుకుంటారు.

ఇక ప్రస్తుతం చరణ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే శంకర్ డైరెక్షన్ లో తన 15వ సినిమా చేస్తున్నాడు రాం చరణ్. ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

సీ.ఈ.ఓ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాతో కూడా పాన్ ఇండియా రేంజ్ లో తన టాలెంట్ చూపించబోతున్నాడు చరణ్. ఆర్.ఆర్.ఆర్ తో చరణ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో సూపర్ కేజ్ తెచ్చుకున్నాడు. ఆస్కార్ అవార్డ్ కోసం యూఎస్ కి వెళ్లిన టైం లో అక్కద హాలీవుడ్ మేకర్స్ తో కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల గురించి డిస్కస్ చేసినట్లు తెలుస్తుంది. శంకర్ తర్వాత కన్నడ డైరెక్టర్ నర్తన్ తో సినిమా ఫిక్స్ చేసుకున్న చరణ్ త్వరలోనే తన హాలీవుడ్ సినిమా గురించి ఎనౌన్స్ చేస్తారని అంటున్నారు.

చరణ్ సినిమాల లైనప్ మెగా ఫ్యాన్స్ కి కిక్ ఎక్కిస్తున్నాయి. శంకర్ సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్లో మరోసారి చరణ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. రంగస్థలం నుంచి చరణ్ సినిమాల లెక్క మారింది. తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరించిన చరణ్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ గా సూపర్ పాపులర్ అయ్యాడు చరణ్.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.