Begin typing your search above and press return to search.

ఏషియ‌న్ నారంగ్ కుమార్తె పెళ్లిలో మెగా బ్ర‌ద‌ర్స్

By:  Tupaki Desk   |   24 Jun 2022 5:30 AM GMT
ఏషియ‌న్ నారంగ్ కుమార్తె పెళ్లిలో మెగా బ్ర‌ద‌ర్స్
X
సీనియర్ నిర్మాత - పంపిణీదారుడు సునీల్ నారంగ్ కుమార్తె.. దివంగత నారాయణ్ దాస్ కె నారంగ్ మనవరాలు జాన్వీ నారంగ్ వివాహ మ‌హోత్స‌వం ఫిలింస‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అత్యంత ఖ‌రీదైన ఎఫైర్ గా సాగిన ఈ వేడుక‌లో వరుడు ఆదిత్యతో కలిసి జాన్వీ ఏడడుగులు వేసింది. హైద‌రాబాద్ హైటెక్స్ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన‌ ఈ మెగా వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

జాన్వీ -ఆదిత్య జంట‌ను ఆశీర్వ‌ధించేందుకు ఇండ‌స్ట్రీ టాప్ గెస్ట్స్ హాజ‌ర‌య్యారు. ఇక ఈ పెళ్లి వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవి- ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్ర‌ద‌ర్స్ ప్ర‌త్యేక అతిథులుగా అటెండ‌య్యి ఆక‌ర్ష‌ణ‌ను తెచ్చారు.

నాగార్జున- పవన్ కళ్యాణ్- గోపీచంద్ - శివ కార్తికేయన్- నాగ చైతన్య తదిత‌ర హీరోలు అటెండ్ కాగా.. దర్శకుల్లో శేఖర్ కమ్ముల- త్రివిక్రమ్-ప్రశాంత్ వర్మ వేదిక వ‌ద్ద క‌నిపించారు.

ఏషియ‌న్ సినిమాస్ అధినేత‌ల‌తో భాగ‌స్వామి అయిన ద‌గ్గుబాటి సురేష్ బాబు వేదిక వ‌ద్ద ఎంతో సంద‌డిగా క‌నిపించారు. ఆయ‌న‌తో పాటు పలువురు హాజరయ్యారు. నూతన వధూవరులు జాన్వీ- ఆదిత్యలను ఆశీర్వదించారు.

23 జూన్ 2022న జరిగిన సునీల్ నారంగ్ కుమార్తె జాన్వీ నారంగ్ వివాహ వేడుకలో స్టైలిష్ తండ్రీకొడుకులు నాగార్జున అక్కినేని - నాగ చైతన్య ను కెమెరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫ‌ర్లు పోటీప‌డ్డారు. చై తెల్లటి ఫార్మల్ షర్ట్ బ్లూ ప్యాంట్ లో ఎప్పటిలాగే డాషింగ్ గా కనిపించ‌గా నాగార్జున ఫార్మల్ లుక్ ని ఎంచుకున్నారు. ఇక వేదిక‌పైకి విచ్చేసే అతిథుల‌ను రిసీవ్ చేసుకుంటూ నారంగ్ కుటుంబ బృందం ఎంతో హ‌డావుడిగా క‌నిపించింది.

దర్శకుడు త్రివిక్రమ్ తో వివాహానికి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఆల్-వైట్ లుక్ లో కనిపించారు. ఇండ‌స్ట్రీ 24 శాఖ‌ల నుంచి ప్ర‌ముఖులంతా ఈ పెళ్లికి హాజ‌ర‌య్యారు. టాలీవుడ్ లో అత్యంత కాస్ట్ లీ వెడ్డింగ్ ఇద‌ని ఇంత‌కుముందు విడుద‌లైన భారీ పెళ్లి వేదిక సెట్స్ వెల్ల‌డించాయి. హైద‌రాబాద్ హైటెక్స్ లో జ‌రిగిన ఈ పెళ్లి కోసం నారంగ్ కుటుంబం కోట్లాది రూపాయ‌ల‌ను వెచ్చించింద‌న్న చ‌ర్చా సాగుతోంది.