Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ కి మెగా ఆశీస్సులు.. కానీ?

By:  Tupaki Desk   |   29 March 2023 2:09 PM GMT
అల్లు అర్జున్ కి మెగా ఆశీస్సులు.. కానీ?
X
అల్లు అర్జున్ హీరోగా లంచ్ అయ్యి నిన్నటికి 20 ఏళ్లు పూర్తయింది. ఆయన హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా గంగోత్రి 2003 సంవత్సరంలో మార్చి 28వ తేదీన రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో బన్నీ హీరో అయి 20 ఏళ్లు పూర్తయింది. ఇక ఆయనకు సోషల్ మీడియాలో పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి సైతం అల్లు అర్జున్ పేరును ట్యాగ్ చేస్తూ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు.

నాకు ప్రియాతి ప్రియమైన బన్నీ సినీ పరిశ్రమలో 20 ఏళ్ళు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. నువ్వు పాన్ ఇండియా స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా ఎదగడాన్ని చూసి నేను సంతోషించాను. నువ్వు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మరెన్నో హృదయాలను గెలుచుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... అని ట్వీట్ చేశారు.

నిజానికి అంతకు ముందు రోజే అల్లు అర్జున్ మరోసారి చర్చనీయాంశంగా మారాడు. దానికి కారణం రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు వెలువతో ముంచిత్తుతుంటే... అల్లు అర్జున్ ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం హార్ట్ టాపిక్‌ గా మారింది.

కానీ నిజానికి అల్లు అర్జున్ పర్సనల్‌ గా రామ్ చరణ్ తేజ్ కి మెసేజ్ చేసి ఉండవచ్చు. కానీ సోషల్ మీడియా వేదికగా విష్ చేయడం కానీ రామ్ చరణ్ ఇచ్చిన పార్టీకి ఆయన నివాసానికి కూడా వెళ్లకపోవడంతో అనేక చర్చలు జరిగాయి.

అయితే చిరంజీవి మాత్రం తన పెద్దరికంను నిలుపుకుంటూ తన మేనల్లుడు సినిమా పరిశ్రమలో 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తన వాత్సల్యాన్ని కురిపించారు.

ఇప్పుడు ఇదే విషయం మీద మెగా అభిమానులు బన్నీ అభిమానులు మధ్య కూడా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇక అల్లు అర్జున్ సినిమాలు విషయానికి వస్తే ఆయన పుష్ప సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న సంగతి తెలిసిందే దానికి సంబంధించిన సీక్వెల్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. పుష్ప 2 పేరుతో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.