అర్జున్ కుమార్ అల్లంకు పిల్ల దొరికింది

Sat Jan 15 2022 21:37:45 GMT+0530 (IST)

Meet Allam Gaari Pelli Koothuru From Ashoka Vanamlo Arjuna Kalyanam

యంగ్ హీరో విశ్వక్ సేన్ పంథా మార్చాడు. `వెళ్లిపోమాకే` సినిమాతో సైలెంట్ గా కెరీర్ ప్రారంభింయిన ఆయన లవర్ బాయ్ గా పేరను తెచ్చుకున్నారు. అయితే ఆ తరువాత చేసిన ఈ నగరానికి ఏమైంది ఫలక్ నుమా దాస్ చిత్రాలతో మాస్ హీరో గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తరువాత చేసిన `హిట్` విశ్వక్ సేన్ కు కొత్త ఇమేజ్ ని అందించింది. అయితే రొమాంటిక్ హీరోగా ట్రై చేసిన `పాగల్` మాత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేక పోయింది. దీంతో మళ్లీ కొత్త తరహా సినిమాకు రెడీ అయిపోయారు.విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం `అశోక వనంలో అర్జున కల్యాణం`. ఎస్ వీసీ డిజిటల్ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథ కథనాలతో రూపొందుతున్న ఈ మూవీ లో హీరోయిన్ గా రుక్సార్ థిల్లాన్ నటిస్తోంది. రవికిరణ్ కోల కథ అందించిన ఈ చిత్రం ద్వారా విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ వడ్డీ వ్యాపాయం చేసే అర్జున్ కుమార్ అల్లం పాత్రలో నటిస్తున్నారు.

ఇందు కోసం కొంత బరువు కూడా పెరిగారు. మూవీ కాన్సెప్ట్ కొత్తగా వుండటంతో దీనికి తగ్గట్టే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ లో హీరో మ్యారేజ్ బ్యూరోని సంప్రదించినట్టుగా పెళ్లి కోసం పిల్ల కోసం ఎదురు చూస్తున్నట్టుగా చూపించారు. సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఓ ఆసక్తికరమైన వీడియోని విడుదల చేశారు. దొరికింది.. దొరికింది..అర్జున్  కుమార్ అల్లం గారికి పిల్ల దొరికేసిందోచ్.. అంటూ ఆసక్తికరమైన వీడియోని రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో ఓ వ్యాన్ కి మైక్ లు ఏర్పాటు చేసి మైక్ పట్టుకుని `పెళ్లికి పిల్ల దొరికేసింది.. అంటూ విశ్వక్ సేన్ ఎగ్జైట్ అవుతూ చెబుతుంటే మద్యలో ఫ్రేమ్ లోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గోపరాజు రమణ ఎంట్రీ ఇచ్చేసి.. మ్.. దొరికింది...దొరికే దాకా ఒక్కటే బాదా...దొరికినంక మొదలవుతై... వెయ్యి నూట పదహార్లు..వున్నయ్ కూడా ఏడిపోతయ్... పిల్ల దొరికిందట పిల్ల.. అంటూ ఆట పట్టిస్తాడు.

ఆ మాటల్ని పట్టించుకోకుండా పిల్లైతే బాగుంది.. మాధవి తన పేరు.. పసుపులేటి మాధవి. అంటూ రుక్సార్ థిల్లాన్ ని పరిచయం చేశాడు. ఓ ఆడపిల్లా.. నువ్వర్థం కావా.. నా జీవితంలో ఆటాడుతావా.. అంటూ లరిక్స్ వినిపించాయి. ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోని ఫస్ట్ సింగిల్ గా జనవరి 19న విడుదల చేయబోతున్నారు. ఈ మూవీతో విశ్వక్ సేన్ ఖచ్చింతగా హిట్ కొట్టేలానే వున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.