'మీరే హీరోలా ఉన్నారు'.. యునిక్ సెటప్ లో 'ఆ అమ్మాయి' యునిక్ సాంగ్..!

Wed Aug 17 2022 16:38:45 GMT+0530 (India Standard Time)

Meere Herolaa Song Out

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి''. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇటీవలే రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.ఇప్పటికే 'ఆ అమ్మాయి..' నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. అలానే 'కొత్తకొత్తగా' అనే పాట ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా 'మీరే హీరోలా..' అనే మరో సరికొత్త సాంగ్ ని చిత్ర బృందం ఏఎంబీ సినిమాస్ లో మీడియా మిత్రుల సమక్షంలో ఆవిష్కరించారు.

సుధీర్ బాబు స్టైల్ అండ్ స్వాగ్ ని చూపిస్తూ.. యూనిక్ సెటప్ తో డిజైన్ చేసిన ఈ సాంగ్ ఆడియన్స్ ని అలరిస్తోంది. సినిమాలో డైరెక్టర్ పాత్రలో కనిపించనున్న సుధీర్.. తన 'మిస్సైల్' మూవీ సక్సెస్ మీట్ నిర్వహించాడు. హీరోకున్న క్యాలిటీస్ అన్నీ ఉన్నప్పుడు మీరే హీరోగా చేయొచ్చు కదా అని మీడియా ప్రశ్నించే సందర్భంలో ఈ పాట వస్తుంది.

ఈ పాటలో 'మీరే హీరోలా ఉన్నారు.. మరి తెరంగ్రేటం ఎప్పుడు చేస్తారు..' అని విలేకరులు అంటుండగా.. 'ఆ పని మనకెందుకు మాస్టారూ.. మైటీ హీరోలే మన మాట వింటారు..' అని సుధీర్ బాబు చెప్తున్నాడు. సంభాషణ మాదిరిగా సాగిన ఈ సాంగ్ తప్పకుండా అందరూ ఇష్టపడే   పాట అవుతుంది.

'మీరే హీరోలా..' సాంగ్ కు వివేక్ సాగర్ ట్యూన్ సమకూర్చగా.. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ అందించారు. విజయ్ ప్రకాష్ ఆలపించగా.. పలువురు యువ గాయనీ గాయకులు గెస్ట్ వోకల్స్ ఇచ్చారు. ఇందులో సుధీర్ వేసిన దీనికి స్టెప్పులు బాగున్నాయి. దీనికి దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

'సమ్మోహనం' 'వి' సినిమాల తర్వాత సుధీర్ బాబు - ఇంద్రగంటి కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై అందరి దృష్టి పడింది. పి జి విందా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై ''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి మహేంద్రబాబు - కిరణ్ బళ్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అందమైన ప్రేమకథతో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రంలో అవసరాల శ్రీనివాస్ - వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - శ్రీకాంత్ అయ్యంగార్ - కళ్యాణి నటరాజన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 16న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.