Begin typing your search above and press return to search.

తెలుగులో ‘మాస్టర్’ రికార్డు కలెక్షన్స్..!

By:  Tupaki Desk   |   14 Jan 2021 6:01 AM GMT
తెలుగులో ‘మాస్టర్’ రికార్డు కలెక్షన్స్..!
X
తమిళ స్టార్ ఇళయదళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ లో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. తనదైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు విజయ్. దీంతో.. ఆయన ప్రతీ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. విజయ్ లేటెస్ట్ మూవీ 'మాస్టర్' జనవరి 13న విడుదలైంది. చాలాకాలం తర్వాత వచ్చిన తమ హీరో సినిమా కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్టర్'.. కాలేజ్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ మూవీలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. విజయ్ హీరోగా నటించడంతోపాటు విజయ్ సేతుపతి విలన్ గా నటించడంతో ‘మాస్టర్'కు ఊహించని రీతిలో మార్కెట్ జరిగింది. అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాల్లోనూ ఈ మూవీ రిలీజ్ అయింది.

అయితే.. తొలి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ బాగుందని చెబుతుంటే.. మరికొందరు ఫస్టాఫ్ బాగుందని, సెంకడాఫ్ మాత్రం సాగదీతగా ఉందని అంటున్నారు. అయితే.. ఇతర ప్రాంతాల్లో టాక్ ఎలా ఉన్నా తమిళంలో మాత్రం ఆ కథ వేరే ఉంటది. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్.. మైండ్ బ్లోయింగ్ అన్న రేంజ్ లో ఉంటుంది అక్కడ. అందుకే.. అభిమానుల కోలాహలంతో మొదటిరోజు షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. దీంతో.. తమిళనాడులో దాదాపు రూ. 23 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేశాడు ‘మాస్టర్’

ఇక, తెలుగులోనూ సత్తా చాటింది ఈ మూవీ. టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాల స్థాయిలోనే ఎక్కువ థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి.. మంచి ఓపెనింగ్స్ దక్కాయి. దీంతో.. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 4.50 కోట్లు వసూలు చేసిందీ సినిమా. ఫలితంగా విజయ్ కెరీర్‌లోనే ఎక్కువ కలెక్ట్ చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది.

ఓవరాల్ కలెక్షన్స్ చూసుకుంటే.. తమిళనాడులో రూ.23 కోట్లు, కర్నాటకలో రూ.3 కోట్లు, కేరళలో రూ.3 కోట్లు సాధించింది మాస్టర్ మూవీ. ఇక, తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.5 కోట్లు, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రూ.1.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.4 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా.. రూ.40 కోట్లు కొల్లగొట్టి సత్తా చాటాడు ‘మాస్టర్’ విజయ్.