ద్విపాత్రలతో మాస్ రాజా ఇచ్చే ట్విస్టు ఆ రేంజులో

Sun May 15 2022 07:00:01 GMT+0530 (IST)

Mass hero raviteja double characters twist

అన్ని ఇంటర్వెల్ లు ఒకేలా ఉండవు. కొన్ని సంథింగ్ అనిపించేలా కిక్కిస్తాయి. అలాంటి ఇంటర్వెల్ లు ఏవి? అని వెతికితే .. ఇంతకుముందు ధూమ్ సిరీస్ లో ఇంటర్వెల్స్ కానీ రేస్ సిరీస్ లో ఇంటర్వెల్స్ కానీ సంథింగ్ స్పెషల్ అన్న టాక్ నడిచింది. హృతిక్ నటించిన ధూమ్ 2 .. అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3లో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది.ఇప్పుడు రవితేజ ధమాకాలో అలాంటి ఇంటర్వెల్ ఒకటి ఉంటుందని కూడా గుసగుస వినిపిస్తోంది. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ రెండు పాత్రల స్వభావం ఎలా ఉంటుంది? అంటే ప్రథమార్థంలో కనిపించే పాత్ర కూల్ గా రెగ్యులర్ గానే ఉన్నా కానీ ఇంటర్వెల్ లో ఎంట్రీ ఇచ్చే పాత్రలో అసలైన ట్విస్టు ఉంటుందట.

ఇది పూర్తిగా నెగెటివ్ షేడ్ తో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. త్రినాథరావు ఇప్పటివరకూ పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు. ఈసారి రవితేజతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తాను కూడా స్టార్ డైరెక్టర్ కేటగిరీలో చేరాలని ఉవ్విళ్లూరుతున్నారట. అందుకే ధమాకాను మరో రేంజులో భారీ యాక్షన్ తో ప్లాన్ చేసారని చెబుతున్నారు.

రవితేజను ద్విపాత్రల్లో మరో రేంజులో చూపించేందుకు తపిస్తున్నాడట.

పూర్తి ఎనర్జిటిక్ గా ఈ పాత్రలో రవితేజ పర్ఫార్మెన్స్ మరో లెవెల్ లో ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇకపోతే రెండో పాత్రలో నెగెటివ్ షేడ్ అనేది ఈ సినిమాకి మరో లెవల్లో ఎనర్జీని అందిస్తుందన్న టాక్ వినిపిస్తోంది.