Begin typing your search above and press return to search.

ఆహా లో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ 'విజయ్ సేతుపతి' ట్రైలర్..!

By:  Tupaki Desk   |   12 May 2021 1:37 PM GMT
ఆహా లో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ విజయ్ సేతుపతి ట్రైలర్..!
X
కోలీవుడ్ స్టార్ హీరో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి నటించిన మాస్ ఎంటర్టైనర్ ''సంగతమిజన్''. ఇందులో రాశీఖన్నా - నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. విజయ్ చందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళ తంబీలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాని ''విజయ్ సేతుపతి'' అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని డిజిటల్ వేదికపై రిలీజ్ చేస్తున్నారు.

తెలుగు ఓటిటి 'ఆహా' లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను వదిలారు. విజయ్ సేతుపతి తనదైన శైలిలో చెప్పే డైలాగ్స్ తో యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. టాలెంటెడ్ యాక్టర్ మరోసారి తన పవర్ ప్యాకెడ్ పెర్ఫార్మన్స్ తో అలరించాడనికి వస్తున్నాడని అర్థం అవుతోంది. ఇందులో రవిశంకర్ - అనన్య - నాజర్ - ఆశితోష్ రాణా - సూరి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

''విజయ్ సేతుపతి'' చిత్రానికి వివేక్ - మెర్విన్ సంగీతం సమకూర్చారు. ఆర్.వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రాన్ని తెలుగులో హర్షిత మూవీస్ బ్యానర్ పై రావూరి వి శ్రీనివాస్ విడుదల చేశారు. 'విజయ్ సేతుపతి' ప్రీమియర్ 'ఆహా' యాప్ లో మే 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.