Begin typing your search above and press return to search.

'గుంటూరు కారం' భలే ఘాటేక్కించేలా ఉందే

By:  Tupaki Desk   |   31 May 2023 6:59 PM GMT
గుంటూరు కారం భలే ఘాటేక్కించేలా ఉందే
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 28 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల ద్వారా వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అరవింద సమేత, అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత మాటల మాంత్రికుడు కంప్లీట్ గా మాస్ టచ్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఎస్ఎస్ఎంబి 28 సినిమా టైటిల్ పోస్టర్ , మాస్ స్ట్రైక్ ని రిలీజ్ చేశారు. మోసగాళ్ళకి మోసగాడు మూవీ రీరిలీజ్ చేసిన థియేటర్స్ లో ఈ మాస్ స్ట్రైక్ రిలీజ్ కావడం సూపర్ స్టార్ అభిమానులకి సర్ప్రైజ్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి చాలా రోజుల నుంచి వినిపిస్తున్నట్లే 'గుంటూరు కారం' టైటిల్ కన్ఫర్మ్ చేశారు.

ఇక మూవీ ఫస్ట్ స్ట్రైక్ ని ఫుల్ మాసివ్ గా ఆవిష్కరించారు. సన్నకర్ర సవ్వా దెబ్బ.. అంటూ సాగే బిట్ సాంగ్ తో స్ట్రైక్ విజువల్ ప్రెజెంట్ చేశారు. ఇక సాంగ్ కి తగ్గట్లుగానే గళ్ళచొక్కా, తలకి ఎర్ర టవల్ కట్టుకొని చేతిలో కర్ర తో మిర్చియాడ్ లో రౌడీని కొట్టే విజువల్ ప్రెజెంట్ చేశారు. ఇక నోట్లో నుంచి బీడీ తీస్తూ ఏంటి అత్తా చూస్తన్నారు 'బీడీ త్రీడీలో కనబడతాందా' అనే డైలాగ్ ని పల్నాడు స్లాంగ్ మహేష్ బాబు చెప్పాడు.

ఈ డైలాగ్ చెబుతూ స్టైల్ గా నడుచుకొని వస్తే జీప్ బ్లాస్ట్ అయ్యి పైకి ఎగిరి క్రింద పడుతుంది. విజువల్ ఉన్నదీ తక్కువ నిడివే అయిన సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇప్పటి వరకు చూపించని పక్కా మాస్ రోల్ లో మాటల మాంత్రికుడు ఆవిష్కరించడం విశేషం. సూపర్ స్టార్ స్టైల్, బిట్ సాంగ్ కి తగ్గట్లుగానే నడుచుకుంటూ వచ్చే విధానం అభిమానులని విజిల్స్ వేయించాలా ఉన్నాయి.

మొత్తానికి అతడు, ఖలేజా సినిమాలతో సాధించలేని కమర్షియల్ సక్సెస్ ని గుంటూరు కారంతో కొట్టి సూపర్ స్టార్ కి గిఫ్ట్ గా ఇవ్వాలని త్రివిక్రమ్ గట్టిగానే ప్లాన్ చేశాడు. పక్కా మాస్ మసాలా మూవీకి త్రివిక్రమ్ అదిరిపోయే డైలాగ్స్ పడితే గుంటూరు కారం ఘాటేక్కించడం గ్యారెంటీ అనే మాట ఈ మాస్ స్ట్రైక్ చూసిన తర్వాత వస్తున్న స్పందన. ఇక ఈ మూవీకి తమన్ మ్యూజిక్ కూడా మరింత ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఓవరాల్ గా గుంటూరు కారం మహేష్ అభిమానులకి ఘాటేక్కించే సర్ప్రైజ్ అని చెప్పాలి.