ప్రభాస్ - మారుతి మూవీ క్రేజీ అప్ డేట్

Sun Jun 26 2022 11:01:28 GMT+0530 (India Standard Time)

Maruti Prabhas Movie

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన ఇమేజ్ కి తగ్గ ప్రాజెక్ట్ లలో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. `బాహుబలి` సిరీస్ చిత్రాల తరువాత అదే స్థాయిలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ `సాహో` మూవీలో నటించారు. దక్షిణాదిలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా అ మూవీ ఉత్తరాదిలో మాత్రం రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. ఈ మూవీ తరువాత ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ సినిమాల్లో నటిస్తున్నారు.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్నతొలి మైథలాజికల్ మూవీ `ఆది పురుష్`. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈమూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటోంది. రామాయణ గాథ నేపథ్యంలో ఓ జపాన్ మూంవీ స్ఫూర్తితో ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ స్థాయిలో మెస్మరైజింగ్ విజువల్స్‌తో రూపొందుతున్నఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇక ఈ మూవీతో పాటు `కేజీఎఫ్` డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ మూవీ `సలార్`లో నటిస్తున్నారు. దీనితో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో అత్యంత భారీ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతున్న `ప్రాజెక్ట్ కె`లోనూ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్నాయి. వీటితో పాటు డైరెక్టర్ మారుతితో ఓ ఫ్యామిలీ యాక్షన్ మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇటీవలే `పక్కా కమర్షియల్` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు మారుతి ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ తో చేయబోతున్న ప్రాజెక్ట్ పై చర్చలు జరుగుతున్నాయని ఆయనతో మంచి వినోదాత్మక చిత్రం తీయాలన్నది నా కోరిక అని డార్లింగ్ బుజ్జిగాడు చిత్రాల్లో ఎంత యాక్టీవ్ గా కనిపించారో అదే తరహాలో సాగే సరదా పాత్రలో ఆయనని చూపించాలనుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు మారుతి.

ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటికి వచ్చింది. మారుతి మార్కుఎంటర్ టైన్ మెంట్ ప్రభాస్ మార్కు యాక్షన్ ఎలిమెంట్స్ తో పక్కా కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరపైకి రానున్న ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనన్ ని ఫైనల్ చేశారట. అన్ని పర్‌ఫెక్ట్ గా సెట్టయ్యాక ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి లో సెట్స్ పైకి తీసుకొచ్చే అవకాశం వుందని తెలిసింది.