తన హిట్టు సినిమాల సెంటిమెంట్ తో మారుతి 'పక్కా కమర్షియల్'

Sun Mar 07 2021 12:00:01 GMT+0530 (IST)

Maruti 'Pakka Commercial' with sentiment of its hit movies

దర్శకుడు మారుతి భలే భలే మగాడివోయ్ సినిమా తో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు. నాని హీరోగా నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మహానుభావుడు సినిమా ను చేశాడు. శర్వానంద్ తో మారుతి చేసిన ఆ సినిమా కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలిచింది. ఈ రెండు సినిమా ల్లో కూడా హీరోలు సమస్యతో బాధ పడతూ ఉంటారు. భలే భలే మగాడివోయ్ సినిమా లో నాని మతి మరుపుతో ఇబ్బంది పడుతూ ఫన్ క్రియేట్ చేయగా మహానుభావుడు సినిమా లో శర్వానంద్ ఓసీడీ సమస్యతో బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు మారుతి చేయబోతున్న సినిమా కు ఈ సెంటిమెంట్ ను ఫాలో అవ్వబోతున్నాడు.గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పక్కా కమర్షియల్ సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యింది. షూటింగ్ ప్రారంభం కాకుండానే టైటిల్ ను ప్రకటించకుండానే విడుదల తేదీని ప్రకటించి అందరిని ఆశ్చర్యపర్చిన మారుతి షూటింగ్ ను ఎట్టకేలకు ప్రారంభించాడు. ఈ సినిమా లో హీరో పాత్ర ప్రతి విషయంలో కూడా కమర్షియల్ గా అంటే డబ్బు మనిషిగా ఆలోచిస్తాడట. దాంతో అతడు సన్నిహితులకు కూడా ఒకానొక సందర్బంలో దూరం అవ్వడం జరుగుతుందట. కమర్షియల్ అయిన హీరో పడే కష్టాలను ఫన్నీగా దర్శకుడు మారుతి చూపించబోతున్నాడు. గోపీచంద్ సుదీర్ఘ కాలంగా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సక్సెస్ ఏదో గోపీచంద్ కు పక్కా కమర్షియల్ తో దక్కేనా చూడాలి.