టిక్ టాక్ బూతు టచ్ ఇచ్చిన మారుతి.. వివాదమేనా?

Thu Dec 05 2019 20:00:01 GMT+0530 (IST)

Maruthi Gave Tiktok Dialouge Touch

మెగా హీరో సాయి ధరమ్ తేజ్- రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'.  డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.  నిన్నే ఈ సినిమా ట్రైలర్ విడుదలయింది.  మంచి స్పందన దక్కుతోంది.  శతమానం భవతి గుర్తొచ్చేలా ఉన్నప్పటికీ అదే విషయంపై సెల్ఫ్ సెటైర్ వేసుకుని మరీ ప్రేక్షకులను మెప్పించాడు మారుతి.ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ లో అందరినీ దృష్టిని ఆకర్షించిన మరో అంశం రాశి పోషించిన ఏంజెల్ ఆర్నా పాత్ర. ఈ సినిమాలో రాశి ఒక టిక్ టాక్ సెలబ్రిటీగా కనిపిస్తూ ఫుల్లు కామెడీ పండించబోతోందని ఇప్పటికే మారుతి వెల్లడించారు.  ట్రైలర్లో "ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావ్ ఆబ్బాయ్.. నాక్ నాక్ నాక్ నాకొద్దు" అంటూ రాశి ఖన్నా చెప్పిన డైలాగ్.. ఆ ఎక్స్ ప్రెషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం అడల్ట్ కంటెంట్ ఉండే 'సృజన నాకొద్దు' వీడియో సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయింది. ఇప్పుడు అలాంటి కంటెంట్ తోనే మారుతి కాస్త బూతు టచ్ ఇవ్వడం కాస్త షాక్ ఇచ్చే అంశమే.

ఇది సహృదయులు.. 7 చేపల కథ అభిమానులకు ఫుల్లు ఫన్నే కానీ మహిళా సంఘాలు.. సంప్రదాయవాదులు ఈ 'నాక్ నాక్ నాక్' వ్యవహారానికి ఎలా స్పందిస్తారో తెలియదు. ఈ టిక్ టాక్ ఎపిసోడ్ వివాదాస్పదం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..!