ఫోటోటాక్ : మిస్ వరల్డ్ అందాల ఆరబోత

Tue Aug 09 2022 23:00:01 GMT+0530 (IST)

Manushi Chiller latest photos

ముద్దుగుమ్మ మానుషి చిల్లర్ అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మోడల్ గా ఒకప్పుడు ఎంతగా అందాల విందు చేసినా కూడా పెద్దగా జనాలు పట్టించుకునే వారు కాదు.కాని ఇప్పుడు ఈమె మాజీ మిస్ వరల్డ్ మరియు హీరోయిన్ అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా ఈమె చేసిన మొదటి సినిమా సామ్రాట్ పృథ్వీరాజ్ నిరాశ పర్చినా కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

ఈ అందగత్తె తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్న ఈ ఫోటోల్లో స్టార్ హీరోయిన్స్ ను సైతం తలదన్నేంత అందంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈమె సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే ఆరున్నర మిలియన్ ల ఫాలోవర్స్ కు చేరువ అయ్యింది.

ఇదే రేంజ్ లో ఈ అమ్మడి అందాల ఆరబోత చేస్తే ఖచ్చితంగా అతి తక్కువ సమయంలోనే కోటి మంది ఫాలోవర్స్ ను ఈమె చేరే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. రెగ్యులర్ గా అందాల విందు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు లైఫ్ స్టైల్ ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ పలు కంపెనీలకు ఇన్ స్టా ద్వారా ప్రమోటర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది.

హీరోయిన్ గా ప్రస్తుతం ఈమె ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అనే సినిమా లో నటిస్తుంది. ఆ సినిమా లో ఈమె పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.

అంతే కాకుండా తెహ్రాన్ అనే ఒక సినిమాలో కూడా ఈమె నటిస్తుంది. ఒక్క సినిమా హిట్ అయితే స్టార్ హీరోలకు ఈమె మోస్ట్ వాంటెడ్ గా మారడం ఖాయం.. ఆ ఒక్క సక్సెస్ కోసం ఈమె వెయిటింగ్ అంటున్నారు.