Begin typing your search above and press return to search.

MAA లొల్లి.. జ‌వాబిచ్చిన విష్ణు టీమ్

By:  Tupaki Desk   |   29 Nov 2021 4:22 AM GMT
MAA లొల్లి.. జ‌వాబిచ్చిన విష్ణు టీమ్
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లొల్లి ఇప్ప‌ట్లో ఆగేట్టు లేదు. ప్ర‌శ్నిస్తాం అని శ‌ప‌థం చేసిన ప్ర‌కాష్ రాజ్ టీమ్ అధ్య‌క్షుడు విష్ణుని నిల‌దీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇంత‌కుముందే కొత్త అధ్య‌క్షుడి వ్య‌వ‌హారంపై ర‌క‌ర‌కాలుగా ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం ఆరోపించారు.

`మా` అసోసియేష‌న్ కి వెళితే ఆఫీస్ ఎప్పుడూ క్లోజ్ చేసి ఉంటోంద‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఏదైనా ఫిర్యాదు చేయ‌డానికి లేదా అధ్య‌క్షుని క‌ల‌వాలంటే ఎవ‌రూ ఆఫీస్ లో క‌నిపించ‌డం లేద‌ని అరోపించారు. అయితే ఈ ఆరోప‌ణల‌ను తాజాగా విష్ణు వ‌ర్గం ఖండించింది.

తాము ఆర్టిస్టులంద‌రికీ అన్ని వేళ‌లా అందుబాటులో ఉన్నామ‌ని ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని ప్ర‌త్యారోప‌ణ‌లు చేశారు. వ్య‌క్తిగ‌త ప‌నుల‌తో అందుబాటులో లేని వారిని మారుస్తామ‌ని క‌న్విన్స్ చేస్తామ‌ని అన్నారు.మొత్తానికి విష్ణు వ‌ర్సెస్ ప్ర‌కాష్ రాజ్ ఎపిసోడ్స్ కి ఎండింగ్ లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

అయితే ఇరువ‌ర్గాలు క‌లిసి సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేయాల‌ని మా సొంత భ‌వంతి నిర్మాణం చేప‌ట్టేందుకు మార్గం సుగమం చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.