ప్రకాష్ రాజ్ వెంట రౌడీ షీటర్? మంచు విష్ణు ట్విస్టే ట్విస్టు!

Sun Oct 24 2021 13:29:31 GMT+0530 (IST)

Manchu Vishnu Counter To Prakash Raj

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల రచ్చ ఇంతటితో ఆగేట్టు లేదు. ఇన్నాళ్లు కేవలం ఆర్టిస్టుల్లో ఇంటర్నల్ కొట్లాట మాత్రమే జరిగేది అనుకుంటే ఇప్పుడు రచ్చ పొలిటికల్ కారిడార్ కి చేరింది. ఈ ఎన్నికల్లో రాజకీయ నాయకులు తెరవెనక కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. రౌడీ షీటర్లు కం నాయకులు ఆర్టిస్టుల ఎన్నికల్లో తలదూర్చారనే ప్రూఫ్ ని తాజాగా మంచు విష్ణు వీడియో రూపంలో విడుదల చేయడం సంచలనమైది.ఇప్పుడు ఏకంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్లో గెలిచిన హీరో శ్రీకాంత్ కి నూకల సాంబ అనే రౌడీ షీటర్ కి ముడిపెడుతూ ప్రముఖ వార్తా చానెల్లో కథనం రావడం సంచలనమైంది. ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ఎపిసోడ్ లో భాగంగా ఒకరిపై ఒకరు పోటాపోటీ వీడియోలు రిలీజ్ చేస్తుండగా.. తాజా ఎపిసోడ్ లో వైసీపీ కార్యకర్త నూకల సాంబ వీడియోని రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఇక వైసీపీ కార్యకర్త నూకల సాంబ శివరావు శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ వారసుడు రోహన్ నటించిన పెళ్లిసంద-డి టీమ్ కి తిరుమలలో ఎస్కార్ట్ గా కనిపించిన వీడియో ఆధారాన్ని సదరు చానెల్ టెలీకాస్ట్ చేసింది. వైసీపీ రౌడీ షీటర్ సాంబ మంచు విష్ణు- మంచు మోహన్ బాబు వెంట ఎన్నికల వేళ ఉన్నారంటూ ప్రకాష్ రాజ్ ఆరోపించగా.. దానికి కౌంటర్ గా ఇప్పుడు నూకల సాంబ .. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుడైన శ్రీకాంత్ తో లింకప్ చేస్తూ ఈ వీడియో కనిపించింది. ఇది పెళ్లిసంద-డి రిలీజ్ ముందు తిరుమల విజిట్ లో సాంబ కనిపించడం ఆసక్తికరం. అతడికి సినీపరిశ్రమతో సత్సంబంధాలున్నాయి.

 సాంబ రౌడీ షీటర్. ప్రత్యర్థిపై హత్యాయత్నం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సినీపరిశ్రమలో ఫైనాన్స్ సమస్యల పరిష్కారానికి రౌడీ షీటర్ సాంబను ఉపయోగించుకుంటారన్న విషయాన్ని సదరు చానెల్ వెల్లడించింది. ఇక మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణుతో సత్సంబంధాలు కలిగి ఉన్న సాంబకు ఇటు శ్రీకాంత్ తోనూ సంబంధాలున్నాయని ఆ కథనంలో పేర్కొనడం కొసమెరుపు. మొత్తానికి మంచు విష్ణుకి.. ప్రకాష్ రాజ్ వర్గంలోని శ్రీకాంత్ కి కూడా సాంబ క్లోజ్ అన్నది ఈ కథనం రివీల్ చేయడం మరో ట్విస్టు. మొత్తానికి మూవీ ఆర్టిస్టులతో రౌడీ షీటర్ల లింకప్ వార్త ఇప్పుడు రచ్చను మరో లెవల్ కి చేరుస్తోందనే చెప్పాలి.