మనోజ్ కొత్త లుక్.. పోలా అదిరిపోలా..!

Fri Dec 09 2022 11:28:33 GMT+0530 (India Standard Time)

Manchu Manoj New Look

టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నా కొంతమందికి బ్యాడ్ లక్ వెంటాడటంతో కెరీర్ లో వెనకపడాల్సి వస్తుంది. అలాంటి వారిలో చెప్పుకుంటే ముందుగా వినిపించే పేరు మంచు మనోజ్ అని చెప్పొచ్చు. మంచు ఫ్యామిలీ హీరోగా అనతికాలంలోనే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న మనోజ్ తను చేసిన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు. తనలోని ఈజ్.. స్ట్రెంగ్త్.. యాక్టింగ్ టాలెంట్ అంతా కూడా మోహన్ బాబు కి పర్ఫెక్ట్ వారసుడు అనిపించాడు. అయితే మంచి ఫాం లో ఉన్న టైం లో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో సినిమాలు చేయడంతో వరుస సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.  గుంటూరోడు ఒక్కడు మిగిలాడు సినిమాలు చేసినా అవి కూడా వర్క్ అవుట్ అవలేదు. ఈలోగా మ్యారేజ్ అవడం అక్కడ కూడా కొన్ని డిస్టబెన్సెస్రావడంతో కెరీర్ కి దూరమయ్యాడు. అంతకుముంచు స్లిమ్ గానే ఉండే మంచు మనోజ్ ఈమధ్య భారీగా మారాడు.

అందుకే కొంతకాలం ఎవరికి కనిపించకుండా వెళ్లిన మనోజ్ తన కొత్త లుక్ తో అందరికి సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నాడు. మంచు మనోజ్ కొత్త లుక్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. డైరెక్ట్ లుక్ లా కాకుండా ఒక పోస్టర్ తరహాలో తన గడ్డం ఫోటోని షేర్ చేశాడు మంచు మనోజ్.

మంచు ఫ్యామిలీలో స్టార్ అయ్యే క్వాలిటీస్ అన్ని ఉన్నా సరే కథల విషయంలో మనోజ్ చేసిన పొరపాట్ల వల్లే ఇలా ఉండిపోయాడు. అయితే మంచు మనోజ్ మంచి కథలతో వస్తే మాత్రం తిరిగి ఫాం లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఆమధ్య మొదలు పెట్టిన అహం బ్రహ్మాస్మి సినిమా కూడా మధ్యలో ఆగిపోయింది. ఇక ఇప్పుడు తన లుక్ తో పాటుగా కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు మంచు హీరో. తనకున్న మాస్ ఇమేజ్ ని సరిగా వాడుకుంటే స్టార్ గా ఎదిగే ఛాన్స్ ఉంది. కానీ మంచు మనోజ్ మాత్రం వెనకపడ్డాడు.

మంచు మనోజ్ ట్విట్టర్ పోస్ట్ ఆయన ఫ్యాన్స్ లో ఎక్సయిట్ మెంట్ కలిగేలా చేసింది. మనోజ్ కొత్త సినిమా దర్శకుడు ఎవరు. ఎలాంటి సినిమాతో అతను వస్తున్నాడు లాంటి విషయాలన్ని త్వరలో ప్రేక్షకులకు తెలియచేస్తారు. మనోజ్ తిరిగి ఫాం లోకి వస్తే మళ్లీ మంచు ఫ్యాన్స్ కి పండుగ చేసుకునే అవకాశం వచ్చినట్టే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.