ఇది వూట్.. నో సెన్సార్..ఓన్లీ కమాన్: మంచు లక్ష్మి

Thu Sep 19 2019 13:07:54 GMT+0530 (IST)

Manchu Lakshmi New Talk Show with Telugu Celebs

బాలీవుడ్ లో ఈ మధ్య కొన్ని బోల్డ్ చాట్ షోలు పాపులర్ అయ్యాయి.  ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్'.. సీనియర్ యాక్ట్రెస్ నేహా ధూపియా నిర్వహించే 'నో ఫిల్టర్ విత్ నేహ' లాంటివి. ఇక అర్బాజ్ ఖాన్ నిర్వహించే 'పించ్' మాత్రం కాస్త విభిన్నమైన షో. సెలబ్రిటీలను పిలిచి వారిపై సోషల్ మీడియా ట్రోల్స్ ఎలా ఉన్నాయో చెప్పి వాటిపై   అభిప్రాయాలు అడుగుతూ ఉంటాడు. అయితే మొదటి రెండు మాత్రం 'బట్టలిప్పుకుని మాట్లాడుకుందాం' టైపు.. అంటే నో సెన్సార్.  ప్రశ్నలు కూడా "మీ సెక్సువల్ ఓరియెంటేషన్ ఏంటి.. మీ ఫేవరెట్ సెక్స్ పొజిషన్ ఏంటి?" అనే స్థాయిలో ఉంటాయి.  అవి బేసిక్ లెవెల్.. అక్కడి నుంచి హోస్టులు ఎంత దూరమైనా పోవచ్చు!అయితే ఆ స్థాయిలో తెలుగులో ఇంకా షోలు రాలేదు.  తాజాగా మంచు లక్ష్మి మొదలు పెట్టబోయే 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' టాక్ షో ప్రోమో చూస్తే ఆ బోల్డ్ ట్రెండ్ ఇక్కడికి వస్తోందేమో.. ఆల్రెడీ వచ్చేసిందేమో అనిపించకమానదు.  రీసెంట్ గా ఈ షో ప్రోమోను మంచు లక్ష్మి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ "ఇది టీజర్ కంటే కొంచెం ఎక్కువ.  షో నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ శాంపిల్స్ ను ఇలా ఒక టీజర్ లా సూపర్ ఫన్ గా కట్ చేశాం.  ఇదే ఇలా ఉంటే మొత్తం షో ఎలా ఉంటుందో ఊహించుకోండి.  23 సెప్టెంబర్ నుండి వూట్ లో ప్రసారం అవుతుంది. వేచి చూడండి" అంటూ ట్వీట్ చేశారు.

ఇక ఆ శాంపిల్ కాస్త ఘాటు గానే ఉంది. టీజర్ ఓపెన్ చెయ్యగానే "ఇప్పటి వరకూ వినని ఊహించని కాన్వార్సేషన్స్" అంటూ తనదైన స్పెషల్ యాక్సెంట్ లో మంచు లక్ష్మి ఇంట్రో ఇచ్చారు.  మెగా హీరో వరుణ్ తేజ్ "అమ్మాయిలు ఎలా ఉన్నారో మీకు తెలుసు.. అన్నీ చేయాలి"  అన్నాడు. మరి ఏం చేయాలో ఆ మెగా హీరో ఏం చెప్పాడో!  "మీ ఫస్ట్ కిస్ ఎప్పుడు?" అని మంచు లక్ష్మి అడిగితే 'టెంత్ క్లాస్" అని కాస్త ఓపెన్ గా చెప్పాడు.

ఇక రకుల్ ప్రీతుది మరీ రచ్చ. "అతనే నాకు బట్టలు వేస్తాడు.. నాకు బట్టలు విప్పుతాడు"..  కికికికి..కీ అని నవ్వేసింది. దీనికి మంచులక్ష్మి  కూడా హిహిహిహి... హీ అంటూ భలే భలే నవ్వింది.  దుస్తులను వేయడం ఏంటో విప్పడం ఏంటో.. మరి.  ఇలాంటి కట్ షాట్స్ తో పాటుగా "మా స్పైసీ సీక్రెట్స్ వింటే మీ మతి పోతుంది"  అంటూ షో గురించి ఓ కత్తి లైన్ కూడా చెప్పారు మంచు లక్ష్మి.  ఇంకో సందర్భంలో "ఇది వూట్.. నో సెన్సార్..ఓన్లీ కమాన్" అంటూ చేతులను అదో రకంగా ఊపుతూ రచ్చ చేశారు మన మంచువారి ఆడపడుచు. 

ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఇది అసభ్య సమాజానికి ఇస్తున్న పరమ అసభ్య సందేశంలాగానే ఉంది.  సభ్య సమాజం.. సంప్రదాయ సమాజం సభ్యులను కొరడాకు కారంపొడి పూసి దాంతో ఎడా పెడా బాదినట్టే. మరి ఈ షో తో తెగులు చాట్ షోతో .. సారీ తెలుగు చాట్ షోతో మన చాట్ షోల దశ దిశ పూర్తిగా మారినట్టే. గెట్ రెడీ బోల్డ్ వ్యూయర్స్ .. మీకు మాత్రం ఇది పురుషాంగం పండగ లాంటిదే..!

వీడియో కోసం క్లిక్ చేయండి