Begin typing your search above and press return to search.

ఆయిలీ అందాల‌తో ఆవిరి పుట్టిస్తోంది!

By:  Tupaki Desk   |   16 Feb 2020 8:30 PM GMT
ఆయిలీ అందాల‌తో ఆవిరి పుట్టిస్తోంది!
X
టోన్డ్ బాడీ.. ఫిట్ బాడీ.. స్లిమ్ బాడీ అంటూ బాడీ టైప్ ని వ‌ర్ణిస్తుంటారు. ఇటీవ‌ల టోన్డ్ బాడీకి ఆయిల్ పుల్లింగ్ చేస్తే వ‌చ్చే కొత్త లుక్ తోనూ భామ‌లు ఫుల్ గా ఫేమ‌స్ అయిపోతున్నారు. రొటీన్ గా క‌నిపిస్తే బోర్ ఫీల‌వుతున్న ఆడియెన్ కి ఇదో ర‌కం కొత్త ట్రీట్. ఇదిగో మాళ‌విక మోహ‌న‌న్ సైతం ఈ టైప్ లో ట్రై చేసి వేడి పెంచేస్తోంది.

మాళ‌విక ఆయిలీ లుక్ కుర్ర‌కారుకు కంటిపై కునుకు ప‌ట్ట‌నివ్వ‌ని ప‌రిస్థితి ఉంది. ఇక లేటెస్ట్ లుక్ లో స‌ర్ప‌క‌న్య‌ను త‌ల‌పించేలా ఆ డిజైన‌ర్ డ్రెస్ మాళ‌విక‌కు అద్భుతంగా సెట్ట‌య్యింది. మాళవిక మోహనన్ త్వ‌ర‌లోనే స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ట్రీటివ్వ‌బోతోందన్న ప్ర‌చారం న‌డుమ ఈ ఫోటోలు వైర‌ల్ అయిపోతున్నాయ్.

ఈ మ‌ల‌బారు బ్యూటీ.. ఇంత‌కుముందు రజనీకాంత్ `పేట` సినిమాలో మెరిసింది. తమిళ్ స్టార్ విజయ్ కొత్త చిత్రం ప‌ట్టాస్ లోనూ న‌టిస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ స‌ర‌స‌న `హీరో` అనే చిత్రంలోనూ న‌టిస్తోందని ప్ర‌చార‌మైంది. ఫిల్మ్ ఫేర్ టు లాక్మే ఫ్యాష‌న్ వీక్ వ‌ర‌కూ వేడుక ఏదైనా మాళ‌విక త‌న‌దైన శైలిలో చెల‌రేగిపోతుంటుంది. పెద్ద తెర‌పైనా అంతే పెద్ద స్టార్ అవుతుందేమో కాస్త ఆగితే కానీ తెలీదు.