Begin typing your search above and press return to search.

అందుకే దేశాన్ని విడిచి వెళ్లాన‌ని హాటీ ఆవేద‌న‌

By:  Tupaki Desk   |   24 Sep 2021 8:30 AM GMT
అందుకే దేశాన్ని విడిచి వెళ్లాన‌ని హాటీ ఆవేద‌న‌
X
బోల్డ్ బ్యూటీ మల్లిక శ‌రావ‌త్ ఇటీవ‌ల త‌న ఉనికిని చాటుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌ర్డ‌ర్.. హిస్.. లాంటి చిత్రాల‌తో ఈ భామ తెలుగు ఆడియెన్ కి కూడా సుప‌రిచితం. గురులో ఐట‌మ్ నంబ‌ర్ తోనూ ఓ ఊపు ఊపిన ఈ బ్యూటీని త‌ల‌వ‌ని యూత్ ఉండ‌రు. ఇక టాలీవుడ్ యంగ్ హీరో అల్ల‌రి న‌రేష్ మ‌ల్లిక‌ను తాను ఆరాధిస్తాన‌ని అన్నారంటే త‌న‌లో ఉన్న మ‌హ‌త్తు ఎలాంటిదో అర్థం చేసుకోవాలి.

సెక్స్ సింబల్ ఇమేజ్ తో మ‌ల్లిక కెరీర్ ని సాగించారు. హిందీ- తమిళం- చైనీస్ - ఆంగ్ల చిత్రాలలో పనిచేసిన మ‌ల్లిక అనూహ్యంగా భార‌తీయ సినిమాకి దూర‌మై విదేశాల్లో స్థిర‌ప‌డింది. 2010 లో లాస్ ఏంజిల్స్ నుండి గౌరవ పౌరసత్వాన్ని కూడా పొందింది. తాజా ఇంటర్వ్యూలో మ‌ల్లిక ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని ముచ్చ‌టించారు. మహిళల పట్ల భారతీయుల దృక్పథాలు మారాయని ఆమె చెప్పారు. వెబ్ సిరీస్ లు సినిమాలలో నగ్నత్వం లేదా బోల్డ్ సన్నివేశాలను చూడటం ప్రజలు మునుపటి కంటే చాలా ఎక్కువగా ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నార‌ని ఆమె అన్నారు. నటీమణులు ఆశించినది ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇలా జ‌రుగుతుంద‌ని వ్యాఖ్యానించారు. క‌థానాయిక‌ల‌ కోసం రచయితలు మరింత సాహసోపేతమైన పాత్రలు రాస్తున్నారు అని మల్లిక పేర్కొంది.

కెరీర్ సాగించే క్ర‌మంలో త‌న‌పై విమ‌ర్శ‌ల ఝ‌డివాన త‌న‌ని ఇబ్బంది పెట్టింద‌ని మ‌ల్లిక వెల్ల‌డించారు. నేను దేశం విడిచి వెళ్లిపోవాల్సొచ్చింద‌ని అన్నారు. ఆ వివాదాల వ‌ల్ల అలా వ్యవహరించాను. నేను ఎదుర్కొన్న తీర్పు అలాంటిది. సామాన్య ప్రజానీకం ఎదుర్కొన్న బెదిరింపు లు వేధింపుల త‌ర‌హాలో నేనూ ఎదుర్కొన్నాను. నేను దానిని ఎదుర్కోలేనని మీకు తెలుసు.. అది నా హృదయాన్ని ముక్క‌ల‌య్యేలా చేసింది. గాయ‌ప‌రిచింది. అందుకే నేను దేశం విడిచిపెట్టాను. నేను తీసుకున్న తెలివైన నిర్ణ‌య‌మ‌ది అని భావించాను.. అని అన్నారు. కొంత మీడియా త‌న‌కు మ‌ద్ధ‌తుగా నిలిచానా చాలా భాగం మీడియా దుర్మార్గం చూపించింద‌ని కూడా మ‌ల్లిక ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అబ‌ద్ధాలు క‌ట్టుక‌థ‌లు రాసారు. కొంద‌రు మీడియా ప్ర‌త‌నిథులు.. నాపై త‌ప్పుడు రాత‌లు రాసారు. ఎన్నడూ ఊహించ‌ని తప్పు లను ఆపాదించారు. కొంద‌రితో లింకులున్నాయ‌ని రాశారు. ఇది నిజంగా చాలా ఓవ‌ర్ అవుతోందని భావించాను. నా జీవితంలో ఈ ప్రతికూలత నాకు అవసరం లేదు. అందుకే దేశం విడిచాను`` అని తెలిపింది.

రీఎంట్రీకి రంగం సిద్ధం

త‌న‌దైన అందం సెక్స‌ప్పీల్ తో బాలీవుడ్ లో ఒక సీజ‌న్ ని ఏలింది మ‌ల్లికా శ‌రావ‌త్. య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్ లో మ‌ర్డ‌ర్ లాంటి బోల్డెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందుకుంది. ఆ సినిమాలో ఇమ్రాన్ హ‌స్మీతో పెద‌వి ముద్దులు రొమాన్స్ లో మ‌ల్లిక చెల‌రేగిన తీరు ద‌శాబ్ధం పాటు చ‌ర్చ‌ల్లోనే నిలిచింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ భామ‌కు వీరాభిమానులేర్ప‌డ్డారు. ఆ క్ర‌మంలోనే హాలీవుడ్ లోనూ ప‌లు క్రేజీ అవ‌కాశాలొచ్చాయి. జాకీచాన్ అంత పెద్ద స్టార్ అవ‌కాశం ఇవ్వగానే హాలీవుడ్ లో న‌టించింది. కానీ ఆ త‌ర్వాత బాలీవుడ్ ని వ‌దులుకుంది.

కొన్నేళ్ల పాటు త‌న బోయ్ ఫ్రెండ్ తో క‌లిసి మ‌ల్లిక విదేశాల్లో సెటిలైంది. కానీ ఇటీవ‌ల‌ తిరిగి ముంబైకి వ‌చ్చి మ‌రోసారి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బాలీవుడ్ చుట్టూ తిరుగుతోంది. చివ‌రి ఇన్నింగ్స్ లో ఆఫ‌ర్ల కోసం సీరియ‌స్ గా ర‌క‌ర‌కాల ప్ర‌యత్నిస్తోంది. నిజానికి ఇంట‌ర్నేష‌న‌ల్ సినిమాల్లో న‌టించాక లోక‌ల్ ఆఫ‌ర్లు వ‌చ్చినా కానీ బెట్టు చేసింది. దాంతో ఆ అవ‌కాశాలన్నీ చేజారాయి. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో సినిమాలు వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తోంది. ఇటీవ‌ల వ‌రుస‌ ఫోటోషూట్ల‌తో మ‌ల్లిక సోష‌ల్ మీడియాల్లో విరుచుకుప‌డుతోంది. మ‌ల్లిక డెడికేష‌న్ చూసి తిరిగి అవ‌కాశాలిస్తున్నార‌ట‌.