Begin typing your search above and press return to search.

నరేష్ మళ్ళీ పెళ్లి.. ఆడియన్స్ ఆశీర్వాదం నిల్

By:  Tupaki Desk   |   28 May 2023 8:58 AM GMT
నరేష్ మళ్ళీ పెళ్లి.. ఆడియన్స్ ఆశీర్వాదం నిల్
X
సీనియర్ యాక్టర్ నరేష్, పవిత్ర లోకేష్ జంటగా మళ్ళీ పెళ్లి అనే సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నరేష్ నిజజీవితంలో జరిగిన సంఘటనలని స్పూర్తిగా తీసుకొని తెరకెక్కించారు. గత కొంతకాలంగా నరేష్, పవిత్ర లోకేష్ లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు. వారు వ్యక్తిగత జీవితాలలో జరిగిన సంఘటనల సమాహారమే మళ్ళీ పెళ్లి మూవీ.

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని విజయ్ కృష్ణ ప్రొడక్షన్ బ్యానర్ పై నరేష్ నిర్మాతగా తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్ లోనే ఈ మూవీ కోసం 15 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు నరేష్ చెప్పుకొచ్చారు. అయితే రివెంజ్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టాల్సినంత అవసరం లేదు కదా అని మీడియాతో చెప్పడం ద్వారా ఈ మూవీకి ఆ స్థాయిలో బడ్జెట్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది.

ఇక దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ కూడా మూవీకి భారీగానేచేశారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. అందులో నరేష్, పవిత్ర లోకేష్ చేసిన హడావిడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక వీరిద్దరి బంధం, ఆ క్రమంలో జరిగిన పరిణామాలు అన్ని కూడా న్యూస్ ఛానల్స్ లో ఇప్పటికే చాలా మంది చూసేశారు.

అయితే అవే సంఘటనలని నరేష్, పవిత్ర లోకేష్ దృక్కోణం నుంచి దర్శకుడు ఎంఎస్ రాజు ఆవిష్కరించారు. నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిని నెగిటివ్ క్యారెక్టర్ లో రిప్రజెంట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి ఆట నుంచి డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఏ ఒక్క వర్గాన్ని ఆకట్టుకోలేదని తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర కంప్లీట్ డిజాస్టర్ గా మళ్ళీ పెళ్లి సినిమా మారిపోయింది.

మొత్తానికి నరేష్ ఎంతో ఇష్టపడి తన వ్యక్తిగత జీవితంలోని అన్ని ఘట్టాలని తెరపై ఆవిష్కరించిన ఆడియన్స్ మాత్రం నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తక్కువ బ్రేక్ ఎవెన్ మార్జిన్ తోనే రిలీజ్ అయిన కూడా ఏ మాత్రం ప్రేక్షకులని ఆకట్టుకొకపోవడం ఆ కలెక్షన్స్ కూడా రావడం కష్టం అనే మాట వినిపిస్తోంది. మొత్తానికి నరేష్ తీసిన మళ్ళీ పెళ్లికి ఆడియన్స్ బ్లెస్సింగ్స్ మాత్రం అసలు దక్కలేదనే మాట ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది.