Begin typing your search above and press return to search.

నరేష్ మళ్లీ పెళ్లి.. ఆమెకు అవకాశం ఇచ్చినట్టే..!

By:  Tupaki Desk   |   28 May 2023 7:25 AM GMT
నరేష్ మళ్లీ పెళ్లి.. ఆమెకు అవకాశం ఇచ్చినట్టే..!
X
సీనియర్ యాక్టర్ నరేష్ లేటెస్ట్ గా మళ్లీ పెళ్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నరేష్ పవిత్ర లోకేష్ నటించారు. ఈ సినిమా తీయడం వెనక కారణాల గురించి నరేష్ ఏదేదో చెప్పినా నరేషన్ వెర్షన్ లో ఆయన పవిత్రకు ఎందుకు దగ్గరయ్యాడు అన్నది.. ఎలా దగ్గరయ్యాడు అన్నది చూపించారు. ఇక తన మూడో భార్య పాత్ర చేసిన వనిత విజయ్ కుమార్ ని చాలా వరకు నెగటివ్ గా చూపించారు. అయితే ఇప్పటివరకు నరేష్ రమ్యల మధ్య ఏం జరిగింది అన్నది వారి పర్సనల్ కానీ మళ్లీ పెళ్లి సినిమా తీసి దాన్ని పబ్లిక్ చేశారు నరేష్.

ఈ సినిమా తీయడం వల్ల నరేష్ ఎంత లాభపడ్డాడు అన్నది పక్కన పెడితే సినిమా వల్ల తన భార్యకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చినట్టే అని అంటున్నారు కొందరు. సినిమాలో ఆమె పాత్రని చూపించిన తీరుని చూసి ఈ సినిమాతో ఆమె ఫైట్ చేసేందుకు ఇంకాస్త బలం చేకూరుతుందని అంటున్నారు. ఆల్రెడీ సినిమా రిలీజ్ కాకుండా అడ్డు పడాలని నరేష్ మూడో భార్య రమ్య గట్టి ప్రయత్నాలే చేసినా అది వర్క్ అవుట్ అవలేదు. ఇక తన బయోగ్రఫీ లాగా ఈ సినిమా చేసిన నరేష్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు.

మళ్లీ పెళ్లి సినిమా తీశాడు సరే దీని వల్ల నరేష్ ఏం సాధించాడు అంటే చెప్పడం కష్టం. పైగా రమ్య రఘుపతి నుంచి ఇంకా డైవర్స్ తీసుకోలేదు కాబట్టి ఈ సినిమా తర్వాత ఆమె ఇంకాస్త నరేష్ ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా తన జీవితంలో జరిగిన.. జరుగుతున్న విషయాల గురించి మళ్లీ పెళ్లి అనే సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరేష్ ఈ సినిమాతో ఆయన ఏం సాధించారు అన్నది మాత్రం అర్థం కావట్లేదు.

ఇక సినిమా వరకు వస్తే నరేష్ తన పాత్ర వరకు బాగా చేశారు. నటుడిగా ఆయన గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే తన కథ అంటూ కేవలం తన వెర్షన్ లో మాత్రమే సినిమా తీశారని మాత్రం అర్థమవుతుంది. ఈ సినిమా చూశాక నరేష్ భార్య రమ్య ఎలా రెస్పాండ్ అవుతారు. ఆమె నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అన్నది తెలియాల్సి ఉంది. నరేష్ మాత్రం ఆమెకు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా డైవర్స్ ఇచ్చి పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని చూస్తున్నారు.